/rtv/media/media_files/2025/10/28/ipo-2025-10-28-10-48-07.jpg)
భారత స్టాక్ మార్కెట్ ఈ వారం IPOల వెల్లువను చూడనుంది. ఈ వారం ఐదు కొత్త కంపెనీలు తమ ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లను (IPOలు) మొదలు పెడుతున్నాయి. అక్టోబర్ లో ఇప్పటికే 10 కంపెనీలు తమ ఐపీవోలను ప్రారంభించాయి. వీటిలో ఏడు కంపెనీలు మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందినవి. ఈ పది కంపెనీలు తమ ఐపీవోల ద్వారా రూ.35, 791 కోట్లు సేకరించాయి. ఇందులో టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన కంపెనీలు ఉన్నాయి. టాటా క్యాపిటల్ ₹15,512 కోట్లు , LG ఎలక్ట్రానిక్స్ ₹11,607 కోట్లు సేకరించాయి. వీటికి తోడు ఇప్పుడు మరో ఐదు కంపెనీలు ఐపీవోలు ప్రారంభిస్తాయి కాబట్టి.. మొత్తం ₹45,000 కోట్లు దాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐదు కొత్త కంపెనీలు ఇవే..
1. ఈ వారం ప్రముఖ కంపెనీ ఓర్క్లా ఇండియా తన ఐపీవోను ప్రారంభిస్తోంది. ఈ కంపెనీ ₹1,667.5 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ IPO అక్టోబర్ 29 నుంచి 31 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. కంపెనీ ఒక్కో షేరుకు ₹695 నుండి ₹730 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. IPO పూర్తిగా అమ్మకానికి ఆఫర్ మాత్రమే అవడంతో.. కంపెనీ సేకరించిన నిధులు పూర్తిగా వాటాదారులకు వెళ్తాయి.
2. నెక్ట్స్ ఐపీవో..ప్రముఖ హెల్మెట్ తయారీదారు స్టడ్స్ యాక్సెసరీస్ నుంచి రాబోతోంది. కంపెనీ ఐపీవో అక్టోబర్ 30 నుండి నవంబర్ 3 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. ఈ కంపెనీ కూడా తన ఐపీవోను పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద పెట్టింది. దీని ద్వారా, ప్రమోటర్లు, వాటాదారులు మొత్తం 77.86 లక్షల షేర్లను విక్రయిస్తారు.
3. ఇవి రెండూ కాక లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కంపెనీ జయేష్ లాజిస్టిక్స్ తన IPOను ప్రారంభిస్తోంది. ఇది అక్టోబర్ 27 నుండి 29 వరకు తెరిచి ఉంటుంది. కంపెనీ తన ఐపీవో ద్వారా ₹28.63 కోట్లు సేకరించాలని చూస్తుంది. షేరు ధర బ్యాండ్ ₹116 నుండి ₹122గా నిర్ణయించబడింది. గేమ్ ఛేంజర్స్ టెక్స్‌ఫ్యాబ్ యొక్క IPO అక్టోబర్ 28 నుండి 30 వరకు తెరిచి ఉంటుంది.
Also Read: Putin: ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్..ప్లుటోనియం డీల్ క్యాన్సిల్
Follow Us