/rtv/media/media_files/2025/10/28/best-business-idea-2025-10-28-11-01-38.jpg)
Best Business Idea
లెస్ ఇన్వెస్ట్‌మెంట్.. ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్ పెట్టాలని కొందరు అనుకుంటారు. అయితే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే నష్టం వచ్చినా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి రాదని కొందరు భావిస్తారు. ఈ క్రమంలో ఏవైనా తక్కువ బడ్జెట్‌లో బిజినెస్ ప్లాన్‌ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. ఆర్థిక సమస్యల వల్ల ఎక్కువ మంది లక్షలు పెట్టుబడి పెట్టలేరు. వేలల్లోనే పెట్టుబడి పెట్టి బాగా లాభాలు ఆర్జించాలని చూస్తుంటారు. అయితే ఫుల్ రష్ ఉన్న ఏరియాలో కేవలం రూ.20 వేలతో ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ పెడితే భారీగా లాభాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ బిజినెస్ వల్ల నెలకు ఈజీగా రూ.30 వేలు సంపాదించవచ్చని చెబుతున్నారు. మరి అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Stock Market: నిన్న ఫుల్ బూమ్...ఈరోజు ఫుల్ లాస్‌లో స్టాక్ మార్కెట్
భారీగా లాభాలు వస్తాయని..
స్కూల్, కాలేజీ, మార్కెట్ ఉన్న ఏరియాలో ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ పెట్టడం వల్ల భారీగా లాభాలు వస్తాయి. సాధారణంగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్ ధర రూ.3,500 నుంచి ప్రారంభమవుతుంది. మీరు రూ.20 వేలు బడ్జెట్ వేసుకుంటే ఈ ధరలో మిషన్ తీసుకోవడం బెటర్. అలాగే స్టార్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా రూ.5 వేలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు పొటాటో ఫింగర్ చిప్స్ 2.5 కిలోల ప్యాక్ రూ. 300 వరకు ఉంటుంది. ఇక నూనె, మసాలాలు, ప్యాకెట్లు అన్ని కూడా ఒక రోజు నడిపించడానికి దాదాపుగా రూ.1000 అవుతుంది. మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఒక పది వేలు అవుతుంది. ఇక మిగతా రూ.10 వేలతో డైలీ ఐటెమ్స్ కొనడానికి ఉపయోగించండి. ఇలా మీరు నెల రోజుల పాటు బిజినెస్ చేయడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడి కేవలం నెల రోజుల్లోనే వస్తుంది. బిజీ ఏరియా అయితే తప్పకుండా రూ.30 వేల వరకు వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మీరు తయారు చేసిన ఖర్చు ఒక రూ.30 అయితే.. మీరు ఇంకో రూ.30 లాభం యాడ్ చేసి విక్రయించాలి. అప్పుడు మీరు త్వరగా లాభాలు పొందుతారు. రోజుకు కనీసం పది ప్యాకెట్లు విక్రయించినా వ్యాపారం సాఫీగా సాగుతుంది. అయితే వ్యాపారం మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే లాభం రావాలంటే కష్టం. కాస్త సమయం పడుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
Follow Us