Gold Rates: అమ్మ బాబోయ్.. రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్ల పెరుగుదల.. 3 రోజులుగా పైపైకే

వరుసగా 3రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ పై రూ.5670 లు పెరిగింది. అటు కిలో వెండిపై దాదాపు రూ.5వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న 24 క్యారెట్(10గ్రా) పసిడి రూ.95,400 కాగా, 22 క్యారెట్ (10గ్రా) బంగారం ధర రూ.87,450 ధర పలుకుతోంది.

New Update
gold rates 123

Gold Rates: బంగారం ధర రోజురోజుకు చుక్కల్లోకెక్కుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.5670 లు పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే ఆరోజు (ఏప్రిల్ 11)న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ మీద రూ.1850, 24 క్యారెట్ గోల్డ్ మీద రూ.2020 లు పెరింగింది. ఏప్రిల్ 10న ఈ పెరుగుదల  రూ.2940 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం రోజు (ఏప్రిల్ 11) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.95,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.87,450 ధర ఉంది.

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

Also Read: IVF with AI: ప్రపంచంలోనే మొదటిసారిగా AI సాయంతో సంతానం

బగ్గుమంటున్న వెండి రేట్లు

అటు వెండి రేట్లు కూడా ఇదే స్థాయిలో బగ్గుమంటున్నాయి. కేజీ వెండిపై నిన్న రూ.4 వేలు పెరగగా.. ఆరోజు రూ.100 పెరిగింది. గడిచిన మూడు రోజుల నుంచి చూస్తే ఈ పెరుగుద దాదాపు రూ.5000 వరకు ఉండొచ్చని అంచనా. కిలో వెండి లక్షా 8 వేలకు చేరింది. వేసవిలో శుభకార్యాలు అధికంగా ఉన్నందున బంగారం కొనాలనుకునే వారికి ఈ ధరలు భారంగా మరుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ఈ రేట్ల కారణంగా బంగారం వైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు సామాన్య ప్రజలు.

Also Read: School bag: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

Also Read: Tesla Cybertruck: టెస్లా సర్‌ప్రైజ్: కేవలం $69,990కి కొత్త సైబర్‌ట్రక్ విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు