Commercial LPG cylinder : బడ్జెట్ రోజున గ్యాస్ బాదుడు: కమర్షియల్ సిలిండర్ ధర ఎంత పెరిగిందంటే?

ఫిబ్రవరి నెలకు సంబంధించి గ్యాస్ ధరలను సవరిస్తూ చమురు విక్రయ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ₹49 మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి.

New Update
gas

ఫిబ్రవరి నెలకు సంబంధించి గ్యాస్ ధరలను సవరిస్తూ చమురు విక్రయ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ₹49 మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.

Also Read :  మరికొన్ని గంటల్లో బడ్జెట్.. ఈ టైంలో ఏం కొనాలి? ఏం కొనొద్దో తెలుసా?

సామాన్య ప్రజలకు ఊరట

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ₹1,691.50 నుండి ₹1,740.50కి చేరింది. అయితే, సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ ఇంట్లో వాడే 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు.

గతంలో ధరల తగ్గింపుతో కాస్త ఊపిరి పీల్చుకున్న వ్యాపార వర్గాలకు, వరుసగా జరుగుతున్న ఈ పెంపులు భారంగా మారాయి. గత సవరణలో కూడా ఏకంగా ₹111 మేర ధర పెరిగిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ రంగాల్లో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి ఏప్రిల్ 2025 నుండి కమర్షియల్ సిలిండర్ ధరలు ఆరుసార్లు తగ్గి, దాదాపు ₹223 మేర తగ్గుదల కనిపించింది. కానీ, నవంబర్, డిసెంబర్ నెలల నుండి ధరలు మళ్ళీ పెరగడం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో బడ్జెట్(Union Budget 2026) రోజే ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read :  బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

Advertisment
తాజా కథనాలు