Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,770  పెరిగి ధర రూ.1,741500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికొస్తే రూ.1,63,950గా ఉంది. మార్కెట్‌లో కేజీ వెండిపై రూ.25 వేలు పెరిగి ధర రూ.4,25,000గా ఉంది.

New Update
gold

Gold Rates

Gold Rates: బంగారం, వెండి ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వీటి ధరలు భారీగా పెరుగుతుండగా.. నేడు రికార్డు స్థాయికి చేరాయి. బంగారం అంటే ఇష్టపడే వారికి, పెట్టుబడిదారులకు నేటి ధరలు షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

ఒక్కరోజే రూ.11 వేలు పెరిగి..

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,770  పెరిగి ధర రూ.1,741500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికొస్తే రూ.1,63,950గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే దీని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు మార్కెట్‌లో కేజీ వెండిపై రూ.25 వేలు పెరిగి ధర రూ.4,25,000గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిణామాల వల్ల ఈ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు