Budget 2026: మరికొన్ని గంటల్లో బడ్జెట్.. ఈ టైంలో ఏం కొనాలి? ఏం కొనొద్దో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు(ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఏ వస్తువులు కొనాలి, ఏం చేయాలి అనేదానిపై ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

author-image
By B Aravind
New Update
What Things to Buy and Do Before the Budget Is Announced to Avoid Price Hikes

What Things to Buy and Do Before the Budget Is Announced to Avoid Price Hikes

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2013 తర్వాత ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి. సాధారణంగా ఆదివారాలు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ ఈసారి బడ్జెట్‌కు మార్కెట్లు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నాయి. ప్రతి ఏడాది బడ్జెట్‌కు ముందు చాలా మంది ఆర్థికపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వస్తువుల ధరలు, పన్ను నిబంధనలు, పెట్టుబడి సరళిని డైరెక్ట్‌గా ప్రభావితం చేస్తాయి.

బడ్జెట్‌కు ముందు కొనాల్సిన వస్తువులు 

దేశీ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పెంచే ఛాన్స్ ఉంది. దీనివల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఖరీదైన గడియారాలు, డిజైనర్ దుస్తులు, ప్రీమియం పాదరక్షల ధరలు పెరుగుతాయి. విదేశాల నుండి నేరుగా దిగుమతయ్యే లగ్జరీ కార్లు, అలాగే విదేశీ బ్రాండ్ల కాస్మెటిక్స్ (సౌందర్య సాధనాలు) పై పన్ను రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే విడిభాగాలపై పన్నులు తగ్గే ఛాన్స్ ఉంది, కానీ విదేశాల నుండి నేరుగా దిగుమతి అయ్యే పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయి. కాబట్టి కొత్త ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్లు కొనాలనుకునే వారు బడ్జెట్ కంటే ముందుగానే కొనుగోలు చేయడం మంచిది. మరోవైపు కస్టమ్స్ డ్యూటీలో మార్పులకు పసిడి మార్కెట్ వేగంగా స్పందిస్తుంది. ప్రభుత్వం సుంకాలను పెంచే అవకాశం ఉండటం వల్ల బడ్జెట్ ప్రకటన తర్వాత బంగారం, వెండి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: రేపే బడ్జెట్.. గ్యాస్, సిగరేట్స్ నుంచి ఫాస్టాగ్ వరకు.. రేపటి నుంచి ఈ ధరల్లో మార్పు?

బడ్జెట్‌కు ముందు చేయాల్సిన పనులు

 ప్రభుత్వం క్రమంగా కొత్త పన్ను విధానం  వైపు మొగ్గు చూపుతోంది. ఒకవేళ మీరు పాత పన్ను విధానంలో  ఉండాలనుకుంటే, బడ్జెట్ మార్పులు రాకముందే Section 80C (రూ.1.5 లక్షల వరకు), Section 80D (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రయోజనాలను వినియోగించుకోండి. బడ్జెట్ ప్రభావం ఎక్కువగా ఉండే మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, రైల్వే రంగాల్లో మీ పెట్టుబడులను ఓసారి సమీక్షించుకోండి. బడ్జెట్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ పతనమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు మంచి షేర్లను కొనుగోలు చేయడానికి కొంత నగదును నిల్వ చేసుకోని సిద్ధంగా ఉండండి. మీరు కొనాలనుకుంటున్న షేర్ల జాబితాను కూడా ముందే సిద్ధం చేసుకోండి.

ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారు బడ్జెట్ వివరాలు వెల్లడయ్యే వరకు వేచి చూడటం మంచింది. హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితులను ప్రభుత్వం పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బడ్జెట్ రోజున ట్రేడింగ్ చేసేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పుల ద్వారా వచ్చే ముప్పును తగ్గించుకోవాలి. మీపై ఉన్న అదనపు రుణ భారాలను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. బడ్జెట్ రోజున మార్కెట్ సుమారు 1 నుంచి 3 శాతం వరకు ఒడిదుడుకులకు లోనయ్యే ఛాన్స్ ఉందని అందుకే ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: బడ్జెట్ తయారీ ముందు అల్వా వేడుక.. అసలు కారణం ఇదే!

Advertisment
తాజా కథనాలు