HAPPY NEW YEAR 2025: వారెవ్వా.. న్యూ ఇయర్ ప్లాన్ అదుర్స్.. రూ.7లకే 3జీబీ డేటా!

BSNL రూ.628తో రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. మొత్తంగా 252 జీబీ డేటా వస్తుంది. రోజుకు 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.7 మాత్రమే.

New Update
Cheapest Recharge Plan

cheapest recharge plan

ప్రముఖ ప్రముత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా కళ్లు చెదిరే రెండు రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ ఎస్ఎమ్ఎస్‌లు, హైస్పీడ్ డేటాతో పాటు అతి తక్కువ ధరకే భారీగా ఇంటర్నెట్ వాడుకునే సదుపాయం కల్పించింది. 

Also Read :2024లో కనిపించని పెద్ద హీరోలు

BSNL రూ.215, 628 ధరలతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇతర టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లతో పోల్చుకుంటే BSNL ప్లాన్ ప్రయోజనాలు అదుర్స్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ

రూ.628 ప్లాన్

BSNL వినియోగదారులు రూ.628తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ఫ్రీ నేషనల్ రోమింగ్ ప్రయోజనం కూడా ఉంది. ఇంకా మొత్తంగా 252 జీబీ డేటా వస్తుంది.

Also Read : దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?

రోజుకు 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.7 మాత్రమే. 100 ఉచిత SMSలు పొందొచ్చు. వీటన్నింటితో పాటు ఛాలెంజర్ అరేనా గేమ్స్, హార్డీ గేమ్స్, గేమన్, జింగ్ మ్యూజిక్, లిస్ట్న్ పోడ్‌కాస్ట్, ఆస్ట్రోసెల్, వావ్ ఎంటర్‌టైన్మెంట్, BSNL ట్యూన్స్ వంటి అనేక కాంప్లిమెంటరీ వాల్యూయాడెడ్ సర్వీస్‌లకు యాక్సెస్ లభిస్తుంది.

Also Read :పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

రూ.215 ప్లాన్

BSNL మరో ప్లాన్ రూ.215. ఈ ధరతో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌లో మొత్తం 60జీబీ డేటా వస్తుంది. అంటే రోజుకు 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు. దీంతో పాటు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు