/rtv/media/media_files/2025/01/22/75VMKwfx7TwzbCSKrvKR.jpg)
Blinkit Photograph: (Blinkit)
ప్రస్తుతం బయటకు వెళ్లి కొనే వారి కంటే.. ఇంట్లో ఉంటూ ఆర్డర్ పెడుతున్నారు. ప్రతీ చిన్న వస్తువును కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇ-కామర్స్ కంపెనీలు కూడా వినియోగదారులకు ఈజీగా ఉండేందుకు అన్ని వస్తువులను తక్కువ టైమ్‌లోనే డెలివరీ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన బ్లింకిట్ ప్రతీ వస్తువును తక్కువ సమయంలోనే డెలివరీ చేస్తోంది.
ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
Smartphone Delivery in Under 10 Mins by Blinkit👍
— Techno Ruhez (@AmreliaRuhez) January 21, 2025
As of now they had partnered with Xiaomi and Nokia ✅
Let's see how many more best selling phones are added in Future pic.twitter.com/0dQLrGizkp
ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే..
ఏ వస్తువును ఆర్డర్ చేసినా కూడా కేవలం పది నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. కానీ స్మార్ట్‌ఫోన్లు మాత్రం ఆర్డర్ చేసిన వెంటనే రావడం లేదు. అయితే వీటిని కూడా ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో డెలివరీ చేసేందుకు బ్లింకిట్ సిద్ధమవుతోంది. దీని కోసం కొన్ని టెక్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. షియోమి, నోకియా వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
ఈ కొత్త సర్వీసును బ్లింకిట్ ఫస్ట్ మెట్రో నగరాలు అయిన బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాపులర్ ఫోన్లను ఇందులో ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తోంది. ఈ ఫోన్లకు కంపెనీ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. వీటితో పాటు ఇంకా పాపులర్ బ్రాండ్ ఫోన్లు తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. అయితే కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా.. ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు వంటివి కూడా డెలివరీ చేస్తోంది.
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!