రేపటితో 2024 సంవత్సరం పూర్తి కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది విడుదలైన టాప్ మోస్ట్ స్మార్ట్‌ఫోన్ల జాబితా ఇక్కడ ఉంది. 2024లో మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన టెక్నాలజీ కలిగిన ఫోన్లు అబ్బురపరిచాయి. మరి అవి ఏంటేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయింది. ఈ ఫోన్ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో అందరినీ అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ అదుర్స్ అనే చెప్పాలి. Galaxy AIతో పాటు S పెన్ ఈ ఫోన్‌ను మరింత లగ్జరీగా మార్చింది. చూడ్డానికి చాలా స్లిమ్‌గా ఉంటుంది.
ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?
Apple iPhone 16 Pro Max
2024లో విడుదలైన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ Apple iPhone 16 Pro Max. ఇది Apple A18 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ దాని మునిపటి మోడల్ కంటే మరింత పవర్ ఫుల్ సామర్థ్యం, వేగవంతమైనది. ఇది 6-కోర్ CPUని కలిగి ఉంది. 6-కోర్ GPU A17 ప్రో కంటే 20 శాతం వేగంగా, మెరుగ్గా ఉంది. ఇందులో కొత్త A18 ప్రోలో 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉంది. అంతేకాకుండా గేమింగ్ ప్రియులకు ఇది మంచి అనుభూతిని అందిస్తుంది. దీని బ్యాటరీ కూడా పవర్ ఫుల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Google Pixel 9 Pro series
ఈ ఏడాది విడుదలైన ఫోన్లలో బెస్ట్ కెమెరా ఫోన్ Google Pixel 9 Pro series. ఇది అద్భుతమైన ఫొటోలు చిత్రీకరించడమే కాకుండా మ్యాజిక్ ఎడిటర్, యాడ్ మీ, రీమాజీన్, పిక్సెల్ స్టూడియో యాప్ వంటి అనేక ఏఐ ఆధారింత పవర్డ్ టూల్స్‌ను కలిగి ఉంటుంది. ఫొటో ప్రియుల కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.
ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
Samsung Galaxy Z Fold7
2024లో Samsung Galaxy Z Fold7 బెస్ట్ ఫోల్డబుల్‌గా నిలిచింది. ఇది Fold5 వెర్షన్‌కి సంబంధించిన రిఫైన్డ్ వెర్షన్. ఇందులో Galaxy AI శక్తితో కూడిన నోట్ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్, లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి.
Apple iPhone 16
2024లో బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ Apple iPhone 16. ఇది 6.1 అంగుళాల డైయాగ్నొల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ AI) టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా Apple A18 సిలికాన్‌తో పనిచేస్తుంది. అప్‌గ్రేడ్ చేయబడిన 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది చాలా వేగవంతమైనది. అన్ని సమయాల్లో దీని కెమెరా అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. అలాగే, మాక్రో-మోడ్ చాలా అద్భుతమైన క్లోజప్ షాట్‌లను తీసుకుంటుంది.
ఇది కూడా చూడండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి
Samsung Galaxy Z Flip6
Galaxy Z Flip6 కవర్‌పై 3.4-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది HD (720x748p) రిజల్యూషన్‌తో వస్తుంది. డైనమిక్ రిఫ్రెష్ రేట్ (1-120Hz)కి మద్దతు ఇస్తుంది. ఇది 1,600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇందులో Galaxy AI-ఆధారిత ఫీచర్లు అందించబడ్డాయి.
Asus ROG Phone 8 series
ఇది కూడా చూడండి: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
2024లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా Asus ROG Phone 8 series నిలిచింది. కొత్త ROG ఫోన్ 8, 8 ప్రో, 8 ప్రో ఎడిషన్ దాదాపు ఒకే డిజైన్‌ను కలిగి ఉంది. ఎక్కువసేపు ఉండేలా పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఇది ప్రత్యేకమైన గేమింగ్ కంట్రోల్ ఫీచర్‌తో వస్తుంది. డిస్‌ప్లే చుట్టూ ఉన్న ఫ్రేమ్ అల్ట్రాసెన్సిటివ్ టచ్ కంట్రోల్‌లతో వస్తుంది. ఇది గేమర్‌లకు వారి గేమ్‌లపై ఎదురులేని ఫింగర్‌టిప్ కంట్రోల్‌ను ఇస్తుంది.