IND vs SA Second Test: రెండో రోజు కూడా భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. కేప్ టౌన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో 63/3 ఓవర్ నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా ఆట ప్రారంభించింది. అయితే మొదటి ఓవర్లోనే సఫారీలకు ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన బెడింగ్‌హామ్ (11) అదే ఓవర్ చివరి బంతికి కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 66 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
Also read:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
నిన్న భారత పేసర్ సిరాజ్ సఫారీలకు చుక్కలు చూపిస్తే...ఈరోజు బుమ్రా (Jasprit Bumrah) వరుసగా వికెట్లను తీసుకుంటూ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. 21.1 ఓవర్ వద్ద కైలీ వెరెనె(9) వికెట్..ఆ తర్వాత మళ్లీ 23.5వ ఓవర్ దగ్గర మార్కో జాన్సెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు బుమ్రా. ఆ తర్వాత కేశవ్ మహరాజ్‌ను పెవిలియన్‌కు పంపి నాలుగో వికెట్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్ ధాటికి 26వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి 19 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.
సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) సెంచరీ చేసాడు. అయితే అవతలి ఎండ్‌లో వికెట్లు త్వరత్వరగా పడిపోవడంతో మార్క్రమ్ సెంచయీ చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. 73 పరుగుల వద్ద మార్‌క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని కేఎల్ రాహుల్ వదిలేశాడు. దీని తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మార్‌క్రమ్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీ చేశాడు. అయితే వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో రోహిత్‌కు (Rohit Sharma) చిక్కాడు. మరోవైపు రబాడ (2)ను ప్రసిద్ధ్ కృష్ణ వెనక్కి పంపాడు. ఎంగిడి (8)ని బుమ్రాను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. సెకండ ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా భారత్‌కు 79 పరుగుల లక్ష్యాన్నిచ్చింది.
నిన్న కేప్‌టౌన్‌లో మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్. క్రీజులోకి దిగిన సఫారీ బ్యటర్లను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బెంబేలెత్తించాడు. 9 ఓవర్లలో ఆరు వికెట్లు తీసి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. బుమ్రాకు రెండు, ముకేశ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్ ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు.
తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కూడా తక్కవు పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 153 పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించింది. వాళ్లు చేసింది కేవలం 55 రన్సే కావడం.. ఇండియావాళ్లు ఓ స్టేజీలో 105/3తో ఉండడం.. చివరి 48 రన్స్ వ్యవధిలో 7 వికెట్లు కోల్పోవడం భారత్ అనిశ్చితికి అద్దం పడుతోంది. 153 పరుగుల వద్ద 5వ వికెట్ లాస్ అయిన టీమిండియా అదే స్కోర్ వద్ద ఆలౌట్ అయ్యింది. చివరి 8 బంతుల్లో నాలుగు వికెట్లను కోల్పోయి ఒకే స్కోర్ దగ్గర ఆరు వికెట్లు కోల్పోయిన టీమ్‌గా రికార్డ్‌లకెక్కింది.