Budget Assembly sSessions:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధం అవుతోంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. మొదటగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ జరుగుతుంది. ఇక ఈ నెల 10న అసెంబ్లీలో ఈ ఏడాదికి సంబంధించి ఆర్ధిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు.
Also Read:Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో NIA సోదాలు..!
వారం నుంచి పదిరోజులు..
బడ్జెట్ సమావేశాలు వారం నుంచి పది రోజులు జరిగే అవకాశం ఉంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అన్న విషయాన్ని ఈరోజు సమావేశాల తర్వాత జరిగే బిఎసీలో ప్రభుత్వం నిర్ణయించనుంది. బడ్జెట్‌లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పార్టీల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్, ధరణి పై నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. మామూలుగా అయితే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగానలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో పాటూ కొత్త గవర్నమెంటు ఏర్పడి కొన్ని నెలలే అవడం...మరోవైపు కేంద్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టడం లాంటివి కూడా తెలంగాణలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణాలు అయ్యాయని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రం జూన్, జూలైల్లో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ కూడా పూర్తి బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉంది.