Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో NIA సోదాలు..!

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ కు మావోయిస్టులతో సంబంధాలున్నయానే ఆరోపణలతో ఎన్ఐఏ బృందం తనిఖీలు చేపట్టారు. ఎల్బీనగర్ లోని రవిశర్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

New Update
Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో NIA సోదాలు..!

NIA: హైదరాబాద్ లోని పలుచోట్ల ఎన్ఐఏ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (Varavararao) అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజామునుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. వేణుగోపాల్ కు (Venugopal) మావోయిస్టుల (Maoist) తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో హిమాయత్‌నగర్‌లోని ఆయన ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

అలాగే ఎల్బీనగర్ లోని రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు