Telangana Elections 2023: తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే!

మొత్తం దేశం అంతా దాదాపుగా ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలు తమ ప్రచారాలను, ప్రయత్నాలను మొదలెట్టేశాయి. మరోవైపు ప్రముఖ పత్రికలు, జాతీయ న్యూస్ ఛానెల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో తాజాగా జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ...తెలంగాణలో మళ్ళీ కారే పరుగెడుతుంది అంటూ తన సర్వేలో వెల్లడించింది.

Telangana Elections 2023: తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే!
New Update

Times Now Survey on TS Elections: ఇప్పటికప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ (BRS Party) 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది టైమ్స్ నౌ. మిగతా పార్టీల్లో బీజెపీ (BJP)2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్ (Congress) కు 3 నుంచి 4 సీట్లు వస్తాయని సర్వేలో తెలిపింది. మరోవైపు ఏపీలో వైసీపీనే ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పింది. మొత్తం 25లో 24 లేదా 25 కూడా ఆ పార్టీనే దక్కించుకుని ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చింది.

17 లోక్ సభ స్థానాలున్న తెలంగాణలో అధికార బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకుంది. ఈ సారి అంతకన్నా ఎక్కువే సంపాదించుకుంటుంది అని చెబుతోంది జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ, 9 నుంచి 11 సీట్లు తన ఖాతాలో వేసుకుంటుంది అని చెప్పింది. బీజెపీ, కాంగ్రెస్ లు 3, 4 స్థానాలు, ఇతరులు ఒక స్థానం దక్కించుకుంటారు.

టైమ్స్ నౌ ఈ సర్వేను కేవలం లోక్‌సభ స్థానాల గురించి మాత్రమే చేసింది. కానీ ఈ లెక్కలను బట్టి చూస్తే తెలంగాణ, ఆంధ్ర అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ మూడో సారి కూడా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని కన్ఫార్మ్ అవుతోంది. ఇది తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ అనే చెప్పవచ్చును. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారధ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో బలంగా ఉందని...కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాలో ఉన్నారు. కానీ సర్వే లెక్కలను బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు నామ మాత్రపు సీట్లే దక్కేలా కనిపిస్తోంది.

ఇక కేంద్రంలో ఎన్డీయే కూటమినే ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ చెప్పింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గానూ బీజెపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. మెజార్టీ మార్కును బీజెపీ మూడోసారి కూడా ఈజీగా దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సర్వేలో తేల్చి చెప్పింది. మరోవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా 175 స్థానాలను మాత్రమే సాధిస్తుందని తెలిపింది. ఇతరులు 61 సీట్లు సంపాదించుకునే అవకాశం ఉందని టైమ్స్ నౌ తెలిపింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 2 నుంచి 3, ఏపీలో 1.30 శాతం ఓట్లతో చాలా కష్టంగా ఓట్లు పడతాయని అంచనా వేసింది.

Also Read: ఏపీలో తగ్గని వైసీపీ హవా…టైమ్స్ నౌ సంచలన సర్వే…వివరాలివే..!!

#times-now-survey-on-ts-elections #times-now-etg-survey #bjp #telangana #survey #brs #times-now-survey #congress #loksabha #times-now
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe