Kavitha : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్

ఇంద్రవెల్లి సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్‌కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చినట్లుంది.. అందుకే ఈ ఆరోపణలు చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామని అన్నారు.

New Update
Kavitha : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్

MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు కవిత. నిన్న (శుక్రవారం) ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై(KCR) సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు నుంచి ఫోన్..

సీఎం రేవంత్‌ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును(TDP Chief Chandrababu) టార్గెట్‌ చేస్తూ కవిత విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రజ్యోతులు వెలిగించడానికి రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. అక్కడి నుంచి (చంద్రబాబు) ఫోన్ వచ్చినట్టుంది అందుకే కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు ఎప్పుడు చేస్తారు అని అడిగితే 100 రోజుల్లో చేస్తామని కాంగ్రెస్ అంటుందని.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు(Congress Six Guarantees) అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపిస్తామని అన్నారు కవిత. తెల్లాపూర్‌లో(Tellapur) గద్దర్(Gaddar) విగ్రహం వెనకాల రియల్ ఎస్టేట్ దందా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

నాన్న ఎక్కడ చెప్తే అక్కడ..

పార్లమెంట్ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగనున్న వేళ మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జర్నలిస్టులు అడుగగా.. పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షుడు ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడినుండి పోటీ చేయనున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణలో ఎక్కడినుండైనా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తనను స్వాగతిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అప్పుడే అభ్యర్థుల ప్రకటన..

తెలంగాణ ఎన్నికల ఫలితాలు తమకు స్పీడ్ బ్రేకర్ లాంటివని అన్నారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తరువాతే బీఆర్ఎస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలిపారు.

Also Read : బాపట్ల జిల్లాలో దారుణం.. రైతు భరోసా కేంద్రంలోనే ఉద్యోగి ఆత్మహత్య..!

DO WATCH: 

Advertisment
తాజా కథనాలు