Telangana: సిగ్గు, జ్ఞానం, బుద్ధి లేదు.. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: కాంగ్రెస్ మంత్రులు

బీఆర్ఎస్ నాయకులు సిగ్గు, బుద్ధి, జ్ఞానం లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. నల్గొండ సభలో కేసీఆర్ మాటలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవంటూ ఎల్బీ స్టేడియం వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: సిగ్గు, జ్ఞానం, బుద్ధి లేదు.. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: కాంగ్రెస్ మంత్రులు
New Update

Hyderabad: బీఆర్ఎస్ (BRS) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మూర్ఖంగా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ (congress) మంత్రులు మండిపడ్డారు. ఈ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth)తోపాటు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ సభలో కేసీఆర్ మాటలను ఉద్దేశిస్తూ కౌంటర్లు వేసిన మంత్రులు.. కేసీఆర్ మాటలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

ప్రజల స్వేచ్చకు భంగం కలిగించారు..
ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిందన్నారు. ఆనాడు ఉద్యయమంలో ఎన్నో కష్టాలు, పోరాటాలు చేసామని, గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల స్వేచ్చకు భంగం కలిగించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయని, ఇకపై స్వేచ్ఛగా ఉటామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. కానిస్టేబుల్స్ సమస్యలపై ప్రభుత్వం పరిష్కారం చేసింది. తెలంగాణలో నిరుద్యోగులు ఆనందంగా ఉన్నారు. గతంలో TSPSC అంగట్లో పాపేర్లు అమ్ముకునేల మారింది. ఇప్పుడు TSPSC ప్రక్షాళన చేశాం. రాష్ట్రంలో మాధకద్రవ్యాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ రహిత తెలంగాణగా మరనుంది. రేవంత్ రెడ్డి ఎక్సైజ్, పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చామని చెప్పారు.

ఇది కూడా చదవండి : AP: నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు..
తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బాలి అవుతుంటే తెలంగాణ రాష్ట్రంను సోనియాగాంధీ ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ వేగవంతం చేసి అందరికి నియామక పాత్రలు ఇస్తున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందన్నారు. అన్న మాటకు కట్టుబడి ప్రతిదీ తూచా తప్పకుండా చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ బానిస భవన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రగతి భవన్ ముందు కంచెను పీకేశాం. ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఇచ్చి ప్రజా భవన్ గా మార్చేశాం. రెండు మాసాలు గడవక ముందే ఏమైందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. వాళ్లకు బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఉండాలి. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు. అధికారం కోసం బీఆర్ఎస్ తహతహలాడి ఆ నలుగురితో కుటుంబ పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మూర్ఖపు మాటలు..
నీళ్లు,నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ గత బిఅరెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. 60రోజుల్లో అద్భుతం సృష్టిస్తున్నాం. గత ప్రభుత్వం అప్పుల కుప్పను పెట్టింది. అప్పులను సొంతానికి, స్వలాభానికి వాడుకుంది. కేసీఆర్ మాటలు మూర్ఖపు మాటలు. ఆయన మాటలను చూసి ప్రజలు నవ్వుతున్నారు. అన్ని వర్గాలు అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ దిశగానే ముందుకెళ్తుందని తెలిపారు.

#ponnam-prabhakar #cm-revanth #jupalli-krishnarao #tummala-nageshwar-rao #hyderabad #kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి