Harish Rao: కాంగ్రెస్ నేతలు జైళ్లలో.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పాలనలో BRS నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు ఇవాళ జైళ్లలో ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ అభివృద్ధి గురించే ఆలోచించేవారని అన్నారు.
MLA Harish Rao: బీఆర్ఎస్ (BRS Party) ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao). పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అనుసరించాల్సిన వ్యూహాలపై వారతో చర్చించారు. అనంతరం తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పై (Congress) విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమే.. భవిష్యత్ మనదే అని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని పేర్కొన్నారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు ఇవాళ జైళ్ల లో ఉండే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అభివృద్ధి గురించే ఆలోచించే వారని తెలిపారు. ఆయనకు పని తనం తప్ప పగతనం తెలియదని అన్నారు. బీఆర్ఎస్ ఓటమి వల్ల కార్యకర్తల గుండెలు రగులుతున్నాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి కసి తో పని చేస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పై చీటింగ్ కేసులు...
కాంగ్రెస్ అన్నిటికీ వంద రోజుల డెడ్ లైన్ పెడుతోందని అన్నారు హరీష్ రావు. వంద రోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్ పై చీటింగ్ కేసులు పెడతారని ఎద్దేవా చేశారు. తాము హైదరాబాద్ లో ఎక్కువ ఉండమని.. మీ కోసం మీ దగ్గరకే వస్తామని అన్నారు. నాలుగు రోజులు ఓపిక పట్టండి .. మళ్ళీ బీఆర్ఎస్ కు బంగారు పళ్లెం లో పెట్టి అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం కాంగ్రెస్ లో మూడు గ్రూపులు..
ఖమ్మం కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉన్నాయని సెటైర్లు వేశారు హరీష్ రావు. ఒకటి వైస్సార్ కాంగ్రెస్, ఒకటీ టీడీపీ కాంగ్రెస్, ఇంకోటి ఒరిజినల్ కాంగ్రెస్ అని చురకలు అంటించారు. పార్లమెంటు లో ఎక్కువ ప్రశ్నలు అడిగింది నామా నాగేశ్వర్రావు మాత్రమే అని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ ని గెలిపిస్తేనే ఖమ్మం జిల్లా కు మేలు జరుగుతుందని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ లు కుమ్మక్కయి ఏడు మండలాల ఏపీలో కలిపాయని ఆరోపించారు. సీలేరు ను లాక్కున్నారని అన్నారు.
కిషన్ రెడ్డి ఆశలు ఆడియాశలే..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణ కు బీఆర్ఎస్ అవసరం లేదంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ లేక పొతే తాము తెలంగాణ కు అన్యాయం చెయోచ్చనీ కిషన్ రెడ్డి అనుకుంటున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి ఆశలు ఆడియాశలే అవుతాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ అని స్పష్టం చేశారు హరీష్ రావు.

ALSO READ: దావోస్‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు!
కాంగ్రెస్ నేతలు జైళ్లలో..

ALSO READ: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం