Telangana: 'రాష్ట్రం పరువు తీయకు'.. సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్ వార్నింగ్..

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో దావోస్‌లో పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత విమర్శలు చేశారు. అర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ప్రశంసలు తీసుకురావని.. కనీసం ఈ ఫోరంలోనైనా చౌకబారు రాజకీయాలు వ్యాఖ్యలు చేయద్దొంటూ హితువు పలికారు.

New Update
Telangana: 'రాష్ట్రం పరువు తీయకు'.. సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్ వార్నింగ్..

CM Revanth Reddy at Davos 2024: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌ దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి కాబట్టి.. రేవంత్‌ రెడ్డి ఇంగ్లీష్‌ భాషపై (CM Revanth's English) బీఆర్‌ఎస్‌ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ (Dasoju Sravan)  కూడా ఈ సదస్సుకు సంబంధించిన ట్వీట్లు, సోషల్‌మీడియా, మీడియా కవరేజీపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సీఎం రేవంత్‌కు సూచనలు చేశారు.

Also Read: అయోధ్య రామమందిరంపై కర్ణాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు..

అర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ప్రశంసలు తీసుకురావని.. కనీసం ఈ ఫోరంలోనైనా చౌకబారు రాజకీయాలు వ్యాఖ్యలు చేయద్దొంటూ హితువు పలికారు. ప్రపంచ వేదికపై పెట్టుబడును ఆకర్షించేందుకు ఆర్థిక విధానాలు, సమర్థత, రాష్ట్రాభివృద్ధిపై ముందుచూపు ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి ట్వీట్‌ చేశారు. న్యూక్లియర్ రియాక్షన్, రింగ్ రోడ్లు, డూప్లికేట్ పొలిటికల్ కామెంట్లు చేస్తే వ్యక్తిగతంగా సీఎంకు గానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎలాంటి ప్రశంసలు రావని చురకలంటించారు. సీఎం కనీసం అంతర్జాతీయ వేదికలపై ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు.

జయేష్ రంజన్, ఇ.విష్ణువర్ధన్ రెడ్డి వంటి నిపుణులతో కలిసి వెళ్లిన రేవంత్.. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడు ఎలా మాట్లాడాలి.. ఎలా మాట్లాడకూడదు అనే విషయాలను వారి నుంచి తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఆయన తీరు వల్ల తెలంగాణకు పెట్టుబడులు, రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చేసి.. గత ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా పని చేసిన ప్రస్తుత ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాత్ర ఏంటి. ఆయన అంతగా బయటకు ఎందుకు కనిపించడం లేదంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే దావోస్‌లో ప్రధానంగా కనిపిస్తున్నారని, అదే సమయంలో అనుభవజ్ఞుడైన, సమర్థుడైన శ్రీధర్ బాబును పక్కన పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అక్కడ అన్నీ తానై కనిపించి తెలంగాణ భవిష్యత్తుకు నష్టం తెచ్చేలా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

Also Read: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్‌ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు

తెలంగాణ ఏర్పడ్డాక..ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహం కూడా ధ్వంసం చేయలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ (Prof Jayashankar) విగ్రహాన్ని ధ్వంసం చేశారని శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంపై దీన్ని దాడిగా భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే క్షమాపన చెప్పాలని.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు