గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్
గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు.దీంతో ఇరువురు హైకోర్టును ఆశ్రయించగా..కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది.