KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈవారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడటం, లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..

KCR Delhi Tour: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనుండటం ప్రధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వారంలోనే ఆయన హస్తినాకు వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాటి అక్రమాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌.. రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Also Read: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల

కాంగ్రెస్‌ను ఢీకొట్టడం కష్టమేనా..?

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని.. కాంగ్రెస్‌ అసెంబ్లీలో చెప్పింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్‌ నౌ చేసిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ సీట్లు ఎక్కువగా వస్తాయని తేలింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఢీ కొట్టడం కష్టమే అని భావిస్తున్న కేసీఆర్‌.. బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారా అనేదానిపై కూడా చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి టాక్‌ వినిపిస్తోంది.

బీజేపీతో కలుస్తారా..?

అంతేకాదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో తమను తప్పించేలా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేయడానికే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నారా అనేదానిపై కూడా ప్రచారాలు సాగుతున్నాయి. ఇప్పటికే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని.. అలాగే దక్షిణ భారత్‌లో కూడా పాగా వేయాలని చూస్తోంది కమలం పార్టీ. ఎన్డీయేతో కలిసేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఇటీవల అమిత్‌ షా కూడా అన్నారు. అయితే కేసీఆర్‌ కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీయేతో జత కడుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పొత్తు ఉండదని చెబుతున్నప్పటికీ.. ఒకవేళ కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు మొగ్గు చూపితే.. ఇప్పటివరకు ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్న ఇరు పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: కవితపై విచారణ జరుగుతోంది.. ఎప్పటికైనా అరెస్ట్ తప్పదు: లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు