దేవరకు పోటీగా రాబోతున్న అక్కినేని వారసుని చిత్రం!

ఎన్టీఆర్‌ దేవర సినిమాకు పోటీగా తండేల్‌ ను విడుదల చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్‌ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్‌ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్‌ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి.

New Update
దేవరకు పోటీగా రాబోతున్న అక్కినేని వారసుని చిత్రం!

Devara: జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR)  నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తరువాత భారీ లెవల్లో నిర్మిస్తున్న సినిమా దేవర(Devara) . కొరటాల శివ(Koratala Siva)  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం తారక్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది.

జాన్వీ(jahnvi)  తొలిసారి తెలుగు తెర మీద తారక్‌ సరసన మెరవబోతున్న విషయం తెలిసింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తారక్‌ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో దేవర చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్‌ అయిన గ్లింప్స్‌ ఇప్పటికే  అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.

ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిత్రం రిలీజ్‌ డేట్‌ ని సినిమా బృందం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది.
అయితే ఈ చిత్రానికి మరో చిత్రం పోటీగా వచ్చి నిలబడగలదా అంటే అది జరగని పని అని ఎవర్ని అడిగినా చెబుతారు. ఎన్టీఆర్‌ సినిమాకి పోటీగా తమ చిత్రాలను విడుదల చేయడానికి మిగతా హీరోలు, డైరెక్టర్లు కూడా కొంచెం ఆలోచిస్తారు.

కానీ అలాంటి రిస్క్‌ చేయడానికి రెడీ అంటున్నాడు అక్కినేని నాగ చైతన్య(naga Chaitnya). ప్రస్తుతం చై తండేల్‌ (Thandel) అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ మీద అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తి అయ్యిందని చిత్ర బృందం చెప్పుకొస్తుంది.

ఈ సినిమాని దసరాకు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ...చిత్ర బృందం నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్‌ ఎనౌన్స్‌ మెంట్‌ రాలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ దేవర సినిమాకు పోటీగా తండేల్‌ ను విడుదల చేస్తున్నట్లు ఈ వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్‌ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్‌ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్‌ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి.

దేవర సినిమా కోసం ఇప్పటికే అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తుండటంతో మొదటి రోజే రికార్డుల రాబడి ఉంటుంది. తండేల్‌ కు సినిమా బాగుంది అనే టాక్‌ వచ్చినా కూడా ముందు మూడు రోజులు మాత్రం దేవరకే హౌస్‌ ఫుల్ బోర్డులు పడే అవకాశాలున్నాయి. మరి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని తండేల్‌ వెనకడుడు వేస్తుందా? లేక దేవరకు ఎదురు నిలబడుతుందా అనేది చూడాల్సిందే!

Also read: డబుల్‌ హ్యాట్రిక్‌ ..మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా!

Advertisment
తాజా కథనాలు