Telangana: బీజేపీలో అయోమయం.. ఈటల VS కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని ఎంపీ ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైడ్రా చర్యలను సమర్ధిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై బీజేపీ ఎంపీలు ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటంతో పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

New Update
Telangana: బీజేపీలో అయోమయం.. ఈటల VS కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీలో అగ్రనేతల వ్యాఖ్యలపై పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో అక్రమ నిర్మాణలను హైడ్రా కూల్చివేయడంపై ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి భిన్నాభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెలరోజుల్లోనే రేవంత్ సర్కార్ 100 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంది. అయితే కూల్చివేతలు సరికాదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అంటున్నారు. మరోవైపు హెడ్రా కూల్చివేతలు మంచిదేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెబుతున్నారు.

Also Read: మోదీకి రేవంత్ ఇచ్చిన మాట ఇదే.. సంచలన విషయాలు చెప్పిన కేటీఆర్!

ప్రభుత్వ విధానంపై బీజీపీ ఎంపీలు ద్వంద్వ వైఖరి అవలింబిస్తుండటంతో పార్టీ నాయకులు పట్టుకుంటున్నారు. హైడ్రా కూల్చివేతలకు మద్దతివ్వాలా లేక వ్యతికేరించాలా అనే అయోమయంలో ఉన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎక్స్‌ వేదికగా ఇలా రాసుకొచ్చారు. ''అధికార పార్టీ ఏదైన మంచి చేస్తే అభినందించాలి. తప్పు చేస్తే విమర్శించాలి, నిరసనలు చేయాలి. లేక్‌లను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా చర్యలను నేను అభినందిస్తున్నాను. దీనిని వాళ్లు ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను'' అని పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్ ప్రజలకు GHMC అలర్ట్.. డెంగీ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన!


Advertisment
తాజా కథనాలు