Mahua Moitra: మహువా మొయిత్రా లంచం తీసుకున్నారు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు

ఎంపీ మహువా మెయిత్రాపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగడానికి ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన అభివర్ణించారు. దీనిపై విచారణ చేపట్టాలని.. ఆమెను పార్లమెంట్ హౌస్ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు.

New Update
Mahua Moitra: ఒత్తిడి చేసి బలవంతంగా సంతకం చేయించారు.. మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

Mahua Moitra Took Bribes: టీఎంసీ పార్టీ (TMC Party) ఎంపీ మహువా మెయిత్రాపై బీజేపీ నేత సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే (Nishikant Dubey) ఆరోపించారు. ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మహువా మొయిత్రా వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నట్లు సాక్ష్యాలను తనతో ఓ న్యాయవాది పంచుకున్నారని నిశికాంత్ దుబే పేర్కొన్నారు. పార్లమెంట్‌లో అదాని గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకొని ఆమె ఇప్పటివరకు 50 నుంచి 61 ప్రశ్నలు అడిగారని తెలిపారు. 2005 డిసెంబర్ 12 నాటి ‘క్యాష్‌ ఫర్‌ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసేలా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడం అనేది వ్యాపారవేత్త శ్రీ దర్శన్‌ హీరానందానీకి చెందిన వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనడానికి ఎలాంటి సందేహం లేదని అన్నారు.

Also Read: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చాలని , అలాగే ఆమెపై పార్లమెంట్‌లో సస్పెన్షన్ విధించాలని నిశికాంత్ దుబే స్పీకర్‌ ఓం బిర్లాను (Om Birla) కోరారు. మరోవైపు ఈ ఆరోపణలపై మొయిత్రా ఘాటుగా స్పందించారు. ముందుగా దుబేపై పెండింగ్‌లో ఉన్నటువంటి ఆరోపణలపై స్పీకర్‌ చర్యలు తీసుకున్న తర్వాత తనపై చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తానని మెయిత్రా అన్నారు. ‘నకిలీ డిగ్రీ పట్టావాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలు చాలానే ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. స్పీకర్‌ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తే స్వాగతిస్తా’అంటూ ఆమె ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ, టీఎంసీ ఈ రెండు పార్టీలకు చెందిన ఈ ఎంపీల మధ్య పార్లమెంట్‌లోనూ తరచూ వాదోపవాదాలు జరుగుతునే ఉంటాయి.

Also Read: ఫ్లిప్‌కార్టులో బంఫర్ ఆఫర్.. కేవలం రూ.999 లకే వాషింగ్ మెషిన్..

Advertisment
తాజా కథనాలు