BJP MP Arvind Kumar Comments On CM KCR: నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్(MP Arvind) రెచ్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది మొసళ్ల పండుగ అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్(CM KCR) ఎన్నో పాపాలు చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని, అందుకు కేటీఆర్ ఆయనకు జన్మించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అభి పిక్చర్ బాకీ హై' అంటూ హెచ్చరించారు. ఎప్పటికీ పసుపు బోర్డు రాదంటూ ప్రచారం చేసిన పింకీలు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్‌భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ ముందు కేటీఆర్ (KTR) ఎంత అని అన్నారు. మోదీని విమర్శిస్తే స్థాయా? అని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ కుటుంబ అవనీతి ఎక్కడ బయటపడుతుందోనని ఇప్పటి వరకు కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్రానికి అందజేయలేదన్నారు. కేటీఆర్ ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ బాధితుల బాధలను తీర్చేది కేవలం మోదీ మాత్రమే అని తెలిపారు. ఇందూరు ప్రజల బతుకులు బాగుపడే రోజులు దగ్గర పడ్డాయని, బీడీ కార్మికులను సైతం ఆదుకుంటామన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యి చెరుకు రైతులు నిగా నిగలాడలని ఆకాంక్షించారు ఈ సమస్యను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఎంపీ అరవింద్. నిజామాబాద్‌కు విమానాశ్రయం అనుమతులు లభించి ఏళ్లు గడుస్తుననా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Govt) స్థలం చూపించడం లేని ఆరోపించారు ఎంపీ అరవింద్. ఇందూరు ప్రజల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డును (Turmeric Board) ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనాలు తెలిపారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలను గెలిపించి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వండంటూ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు అరవింద్.
ఇది కూడా చదవండి: Dhoni : వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్.. ఫోటోస్‌పై ఓ లుక్కేయండి..!!
ఇదిలాఉంటే.. ఒక రోజు వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో మరోసారి పర్యటిస్తున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ఆయన.. ఇవాళ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదనాంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా తెలంగాణలో రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రామగుండం ఎన్‌టీపీసీలో తొలిదశలో నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను, మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైల్వే లైను, విద్యుద్దీకరించిన ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు లైన్లను జాతికి అంకితం చేస్తారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy : తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే!