బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (BJP MLA Raghunandan Rao) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే..బీఆర్ఎస్‌వీ నేతల ద్వారా బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టె కుట్ర చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాను రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్‌వీ ఒత్తడితో తమ నేతలపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: మహానుభావులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా: మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట సీపీ శ్వేత, ఏసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని రఘునందన్‌రావు తెలిపారు. అవినీతి కేసులో ఉన్న ప్రభుత్వ అధికారి హరీష్‌రావు OSD AY గిరి ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనంలో వచ్చి డబ్బులు గిరి పంచుతున్నారని ఫైర్ అయ్యారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ (Collector Office)లో కల్యాణలక్ష్మి చెక్‌లు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు అధికారులపై ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో నన్ను ఎంత టార్చర్ చేశారో అందరికి తెలుసని ఈ సందర్భంగా రఘునందన్‌రావు గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: మగవారు తప్పక తినాల్సిన ఫుడ్