అవినీతి అంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ : స్మృతి ఇరానీ
తెలంగాణ సర్కార్ అప్పులు చేసి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అవినీతి అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్, బీఆర్ఎస్ అని రెండు పార్టీలపై ధ్వజమెత్తారు. దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మృతి ఇరానీ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.