BJP MLA Etela Rajender Fires on CM KCR : ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమ్ లేదు : ఈటల
గతంలో 294 ఉన్న మంది ఉన్న సభలో అందరికి రూమ్ లు ఉండేవి. ఇప్పుడు శాసన సభలో బీజేపీ కి రూమ్ లు లేవు. ఇలాంటి నిబంధన శాసన సభకె అవమానం. శాసన సభలో నిజాం క్లబ్ లో కూర్చొని అసెంబ్లీ కి వచ్చాం. కేవలం మూడు రోజులు మాత్రమే శాసన సభ నిర్వహిస్తాం అంటున్నారు. గురువారం నాటి సభ కేవలం సంతాపానికే పరిమితం అయ్యింది. గతంలో సీపీఐ, సీపీఎం గాని ఉన్నపుడు శాసనసభ అనంతరం బీ ఏ సీ కి అనుమతి ఉండేది. వర్షాలకు అనేక పంటలతో పాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే నిర్మల్,హనుమకొండ, నిజామాబాద్ జిల్లాలో తిరిగి వచ్చాం వారి బాధలు అనేకం ఉన్నాయి. మంత్రి నియోజకవర్గంలో పంట నష్టం సంభవించింది. ములుగు లో అనేక నష్టం జరిగింది రైతులు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. వర్షాల కారణంగా నష్టపోయినవారిని ఆదుకుంటామని కేంద్రం చెప్పింది. వారికి న్యాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు
కాంగ్రెస్ అధిష్టానంలో నాకు దోస్తులు ఉన్నారు: మల్లారెడ్డి.
మేడ్చెల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థి ఉండాలో నేనే డిసైడ్ చేస్తా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ అభ్యర్థి ఉండాలో నేనే డిసైడ్ చేస్తా. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానంలో నాకు దోస్తులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ దగ్గర డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప వేరే సబ్జెక్టు లేదు. మేం చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోయి ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారు. మంత్రివర్గ విస్తరణ అంటే మల్లారెడ్డి పోస్ట్ ఉడుతుంది అనే ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి పై తొడగొట్టిన తరువాత గ్రాఫ్ పెరిగింది.
కొంతమంది మీడియా అసత్య ప్రచారం కక్షపురితంగా చేస్తోంది. త్వరలోనే మీడియా సంస్థ ప్రారంభిస్తున్నా... ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తా.
ఇక వచ్చేదంతా రాజకీయ వరదలే.. జగదీష్ రెడ్డి
రానున్న రోజుల్లో రాజకీయ వరదలు వస్తాయి. అన్ని నియోజకవర్గాల్లో కొత్త, పాత నీరు కలుస్తుంది. రాజకీయ పార్టీల్లో అంతర్గత కలహాలు సహజమే.
Also Read: 3 రోజులు ఏం సరిపోతాయి? అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాల గుర్రు