Sonia Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచి పోషించింది.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసం బీజేపీ దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ. బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 07 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sonia Gandhi: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బీజేపీ పై విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. గత పదేళ్ల పాలనలో పేద ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తోంది వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. Your browser does not support the video tag. ALSO READ: “పిరమైన ప్రధాని గారు” అంటూ మోడీపై కేటీఆర్ ప్రశ్నల బాణం నేడు దేశంలోని బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఉద్దేశాల వల్లే ఈ దేశంలో ఇలాంటి వాతావరణం నెలకొందని తెలిపారు. ఎలాగైనా అధికారం సాధించడంపై మాత్రమే వారి దృష్టి ఉందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశంలో ద్వేషాన్ని పెంచి పోషించారని మండిపడ్డారు. అందరి అభ్యున్నతి, అణగారిన వారికి న్యాయం, దేశ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ, నేనెప్పుడూ పోరాడుతున్నాం అని అన్నారు. కాంగ్రెస్ న్యాయ పత్రం, కాంగ్రెస్ హామీలు దేశాన్ని ఐక్యంగా ఉంచడం కొరకు..పేదలు, మహిళలు, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాలకు బలాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పనిచేస్తోందని అన్నారు. అందరికీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని.. కలిసి బలమైన, ఐక్య భారతదేశాన్ని నిర్మిద్దాం అని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. #congress #bjp #modi #sonia-gandhi #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి