Uttar Pradesh : దారుణం.. టీచర్‌ను తుపాకితో కాల్చి చంపిన విద్యార్థి

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. కంప్యూటర్‌ సెంటర్‌లో క్లాసులు చెబుతున్న టీచర్‌ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు.

New Update
America : అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు!

Student Fire : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని బిజ్నోర్‌లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా టీచర్‌(Teacher) నే తుపాకీతో కాల్చాడు(Gun Fire). ఆస్పత్రిలో 33 గంటల పాటు పోరాడిన ఆ ఉపాధ్యాయురాలు మరణించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిజ్నోర్‌లోని కోమల్ (25) అనే టీచర్‌ కంప్యూటర్ సెంటర్‌లో బోధిస్తుండేవారు. రోజులాగే ఆమె క్లాస్‌కు వెళ్లింది. ప్రశాంత్ అనే పూర్వ విద్యార్థి ఆ తరగతికి వచ్చారు. క్లాస్‌ జరుగుతుండగానే టీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారారయ్యాడు. ఆ టీచర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. కానీ బుల్లెట్‌ను బయటకు తీయలేకపోయారు. దాదాపు 32 గంటల పాటు ఆమె చావుబతుకుల మధ్య పోరాడింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది.

Also Read: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు

మరోవైపు నిందితుడయిన విద్యా్ర్థి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రశాంత్ తండ్రి లవకుష్‌ను కూడా విచారిస్తున్నారు. అయితే ప్రశాంత్ 2022లో కంప్యూటర్ సెంటర్‌(Computer Centre) లో కోర్సు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అతడు ఆ సమయంలో కోమల్‌ను ప్రేమించాడు. ఆమెకు చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ కోమల్ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ అప్పటినుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ప్రతికారంతో చివరికి ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. టీచర్‌పై విద్యార్థి కాల్పులు జరిపడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read: సిక్కుల పవిత్ర గ్రంథం పేజీలు చింపినందుకు యువకుడు దారుణ హత్య

Advertisment
తాజా కథనాలు