Murder : పంజాబ్(Punjab) లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే ‘గురు గ్రంధ సాహిబ్’ బుక్లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిరోజ్పూర్ జిల్లాలోని తల్లిగులాం గ్రామనికి బక్షిశ్ సింగ్ అనే 19 ఏళ్ల యువకుడు శనివారం నాడు బండాల గ్రామంలో ఉన్న గురుద్వార ప్రాంగణంలోకి వచ్చాడు. దీంతో అతడు తనకు కనిపించిన గురు గ్రంధ సాహిబ్ బుక్లో కొన్ని పేజీలను చింపేశాడు. ఇది గమనించిన అక్కడి స్థానికులు అతడిని పట్టుకునేందుకు వచ్చారు. బక్షిశ్ భయంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వాళ్లందరూ కలిసి అతడిని పట్టుకుని చితకబాదారు.
పూర్తిగా చదవండి..Punjab : సిక్కుల పవిత్ర గ్రంథం పేజీలు చింపినందుకు యువకుడు దారుణ హత్య
పంజాబ్లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే గురు గ్రంథ్ సాహిబ్ బుక్లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు.
Translate this News: