Entertainment:హౌస్ లో తారుమారుతున్న లెక్కలు..ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిన అమర్ దీప్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో లెక్కలు నెమ్మదిగా మారుతున్నాయి. ఇప్పటివరకూ మొదటి స్థానంలో ఉన్న శివాజీ మూడో స్థానానికి పడిపోగా అనూహ్యంగా అమర్ దీప్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేశాడు.

New Update
Entertainment:హౌస్ లో తారుమారుతున్న లెక్కలు..ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిన అమర్ దీప్

ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తెలుసుకోవడం కొంచెం ముందుగానే తెలిసిపోయేది. ఐదు వారాలు ముందుగానే విన్నర్ ను గెస్ చేసే వాళ్ళు. అందులోనూ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లో అవ్వగానే కన్ఫార్మ్ అయిపోయేది. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఎవర్ని ఫస్ట్ ప్లేస్‌లో పెడితే వాళ్లే విన్నర్ అయ్యేవాళ్లు. కానీ ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. ఫ్యామిలీ వీక్ లో అందరూ చెప్పిన వాళ్ళను కాకుండా వేరే వాళ్ళని బిగ్ బాస్ విన్నర్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకూ అమర్‌కి నెగిటివ్‌గా.. శివాజీకి ఫేవర్‌గా ఫుటేజ్ వదిలిన బిగ్ బాస్ ఒక్కసారిగా రూటు మార్చేశాడు. వీలయినంత ఎక్కువగా శివాజీకి నెగిటివ్ అయ్యేట్టుగా ఫుల్ ఫుటేజ్ వదులుతున్నారు. ఈ ఎఫెక్ట్‌‌తో 12వ వారం ఓటింగ్ ఒక్కసారిగా తారుమారైంది. విన్నర్ రేస్‌లో ఉన్న శివాజీ మూడో ప్లేస్‌కి పడిపోయాడు. అంతేకాదు ఎవ్వరూ ఊహించని విధంగా అమర్ దీప్ నెంబర్ 01 ప్లేస్‌లోకి దూసుకొచ్చేశాడు. 12వ వారం నామినేషన్స్‌లో ప్రియాంక, శోభాశెట్టి తప్ప మిగిలిన ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు.

Also Read:ఫ్రిడ్జ్ లో పెట్టకూడని పదార్ధాలు ఏంటో తెలుసా?

అర్జున్, అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, రతిక, అశ్విని..ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరందరిలో అమర్ దీప్‌కి ఊహించని స్థాయిలో ఈ వారం ఓటింగ్ పడడ్డట్టు తెలుస్తోంది. మామూలుగా శివాజీ ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అతనికే ఎక్కువ ఓట్లు పడేవి. తరువాత ప్రశాంత్ కి పడేవి. కానీ ఇప్పుడు ఇద్దరూ నామినేషన్స్ లో ఉన్నా కూడా వాళ్లిద్దరి కంటే అమర్ దీప్‌కి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఎందుకంటే ఈ వారం శోభాశెట్టి, ప్రియాంక నామినేషన్స్‌లో లేరు కాబట్టి... వాళ్ళు ఓట్ కూడాలు అమర్ దీప్‌కి పడుతున్నాయి.పైగా శివాజీ బ్యాచ్ ముగ్గురూ నామినేషన్స్‌లో ఉండటం వల్ల.. ఓట్లు భారీగా ఛీలాయి. దాంతో అమర్ దీప్‌కి గంపగుత్తుగా ఓట్లు పడుతున్నాయి. యావర్, ప్రశాంత్ నామినేషన్స్‌లో లేకపోతే.. శివాజీకి ఏకపక్షంగా ఓట్లు పడేవి. అతనే టాప్‌లో ఉండేవాడు.

దీనికి తోడు గత రెండు వారాల్లో అమర్ దీప్ బాగా పుంజుకున్నాడు. కెప్టెన్సీ టాస్క్‌లో అమర్‌ ఏడుపు.. అతనికి చాలా వరకూ సింపథీ గెయిన్ అయ్యేట్టు చేసింది. దాంట్లో బాగా ట్రోల్ అయినా కూడా జరిగిన నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది.శివాజీ‌కి వరుసగా నెగిటివ్ ఎపిసోడ్‌లు పడటం.. అదే సందర్భంలో అమర్ పుంజుకోవడంతో అతని గ్రాఫ్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.

మరోవైపు ప్రశాంత్ కూడా టాప్ లోనే ఉన్నాడు.ఎవిక్షన్ పాస్ టాస్క్‌లో అతను చాలా బాగా ఆడటంతో ఈవారం ఓటింగ్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. అన్ అఫీషియల్ అండ్ యూట్యూబ్ పోల్స్‌లో చాలావరకూ అమర్, ప్రశాంత్‌లే టాప్‌లో ఉన్నారు. కానీ అమర్ కు ప్రియాంక, శోభా ఓట్లు కూడా పడుతున్నాయి.

మొదటి పది వారాల్లో శివాజీ సంబంధించి ఒక్కటంటే ఒక్కటి నెగిటివ్ ఫుటేజ్‌ని కూడా షోలో చూపించలేదు.దీంతో అతని మీద అందరికీ పాజిటివ్ అభిఫ్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఆట మొదలయ్యింది. ముందంతా దాచి ఉంచుతున్నట్టుగా ఇప్పుడు శివాజీ నెగటివ్ ను దాచడంలేదు బిగ్ బాస్. అతను హౌస్ లో చూపిస్తున్న నెగటివ్ నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది శివాజీకి మైనస్ అవుతోంది. పదో వారం నుంచి శివాజీ డైలీ ఎపిసోడ్‌లో నెగిటివ్ ఫుటేజ్ ప్లే చేస్తున్నారు. మొన్నటి శనివారం నాటి ఎపిసోడ్‌లో అయితే శివాజీని రోస్ట్ చేసి పారేశారు హోస్ట్ నాగార్జున. ఈ రెండు మూడు రోజుల ఎపిసోడ్‌లో కూడా శివాజీకి నెగిటివ్‌గానే ఫుటేజ్ పడింది. దీంతో అతని గ్రాఫ్ మెల్లగా తగ్గుతూ వస్తుంది. అమర్‌ని చులకన చేసి మాట్లాడటం.. నోరు జారడం.. బ్యాక్ బిచ్చింగ్.. అబద్దాలు.. దూషణలు.. నామినేషన్స్‌లో సిల్లీ రీజన్లు.. శివాజీ అసలు రంగు బయటపడేలా బిగ్ బాస్ చూపిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి బాగానే వర్కౌట్ అవుతోంది. దీనివల్ల ఎవరు లాభపడినా, పడకపోయినా అమర్ దీప్ కు మాత్రం బాగా కలిసి వస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు