WhatsApp : వాట్సాప్ వాడే వారికి బిగ్ షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త రూల్!

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్ లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి.

WhatsApp : వాట్సాప్ వాడే వారికి బిగ్ షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త రూల్!
New Update

WhatsApp Big Alert 2024 : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్(Google Drive) లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి. అంటే యూజర్లు ఆ లిమిట్ మించకుండా స్టోరేజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాట్ బ్యాకప్స్ కు గూగుల్ డ్రైవ్ లో స్పేస్ కేటాయించే రూల్ 2024 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. అయితే బీటా యూజర్లకు ఈనెల నుంచే ఈ కొత్త రూల్ వర్తించనుంది.

వాట్సాప్(WhatsApp) ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ మార్పు గురించి తెలియజేసింది. పాప్ అప్ మెసేజ్ లు పంపిస్తోంది. ఈ మెసేజ్ వాట్సాప్ సెట్టింగ్స్ లోని చాట్ బ్యాకప్ సెక్షన్ లో కనిపిస్తుంది. వాట్సాప్ బ్యాకప్స్ కు లిమిటెడ్ స్టోరేజీ కోటా మాత్రమే లభిస్తుందని ఆ మెసేజ్ లు పంపిస్తుంది. అలాగే రాబోయే కొద్ది నెలల్లో వాట్సాప్ లోని బ్యాకప్ లు గూగుల్ డ్రైవ్స్ స్టోరేజీని తీసుకుంటాయని వాట్సాప్ పేర్కొంది.

ఈ వారం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.23.26.7లో మెసేజ్ కనిపిస్తోందని వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. వాట్సాప్ యూజర్లకు ఈ మార్పు కొసం సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తుంది. ఎఫ్ఎక్యూలో కూడా ఈ విషయం తెలిపింది. పాప్ అప్ మెసేజ్ లోని లెర్న్ మోర్ బటన్ పై క్లిక్ చేసి హెల్ప్ పేజీని యాక్సెస్ చేసుకోవచ్చు.

గూగుల్ డ్రైవ్ లో వాట్సాప్ బ్యాకప్ లు ఇక నుంచిఫ్రీగాఅన్ లిమిటెడ్ ఉండవని హెల్ప్ పేజీ కూడా చెబుతోంది. యూజర్లు బ్యాకప్ లను ఉంచుకోవాలంటే స్టోరేజీ స్పేస్ మెయింటైన్ చేయాలి లేదంటిఎక్స్ ట్రా స్టోరేజీ కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వాట్సాప్ సెట్టింగ్స్ లోనూ స్టోరేజ్ రివ్యూఆప్షన్ కు వెళ్లి..వాట్సాప్ డేటా ఎంత స్టోరేజీని ఉపయోగిస్తుందో యూజర్లు చెక్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి బ్యాకప్ లను డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.

గూగుల్ డ్రైవ్ స్టోరేజీ కోసం డబ్బు చెల్లించకుండా ఉండేందుకు యూజర్లకు రెండు ఆఫ్షన్స్ కూడా ఉన్నాయి. అనవసరమైన చాట్స్, ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ద్వారా బ్యాకప్ ల సైజును కూడా తగ్గించుకోవచ్చు. చాట్స్ ను గూగుల్ డ్రైవ్ కు బ్యాకప్ చేయడం ఆఫ్ చేసి బదులుగా వాట్సాప్ చాట్ ట్రాన్స్ ఫర్ టూల్ ఉపయోగించుకోవడం మరోక ఆప్షన్. ఈ టూల్ తో యూజర్లు గూగుల్ డ్రైవ్ ఉపయోగించకుండా ఆండ్రాయిడ్ డివైజుల చాట్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ టూల్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ డివైజ్ ల మధ్య చాట్ ట్రాన్స్ ఫర్స్ కు పనిచేయదు. ఇకస్టేటస్ అప్ డేట్ కోసం రిప్లే బార్ స్టేటస్ హెచ్డీ క్వాలిటీ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకునే సదుపాయం, సెర్చ్ మెసేజెస్ బై డేట్ వంటి మరిన్ని ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకువస్తుంది.

ఇది కూడా చదవండి: బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ అలర్ట్.. వాటిని నమ్మి మోసపోవద్దని వార్నింగ్!

#whatsapp #whatsapp-new-feature #whatsapp-features #whatsapp-status #whatsapp-update #google-drive
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe