రాష్ట్రం ఏదైనా సరే ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడే ఎక్కువగా వినిపించే మాట రుణమాఫీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది. రుణమాఫీలపై అనధికారిక ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డిసెంబర్ 11న సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాంటి ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది. అలాంటి తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రచారాల ఉచ్చులోపడి మోసపోకూడదంటూ పేర్కొంది. అలాంటివాటిని గుర్తిస్తే వెంటనే పోలీసులు, సంబంధిత అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలని ఆర్బీఐ కోరింది.
పూర్తిగా చదవండి..RBI: బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ అలర్ట్.. వాటిని నమ్మి మోసపోవద్దని వార్నింగ్!
రుణమాఫీ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. తాము అధికారంలోకి వస్తే రైతులు, మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. రుణమాఫీ ప్రచారంపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.
Translate this News: