HMDA Land Survey In Kokapet: కోకాపేట్‌లో , బుదవేల్‌లో భూములను హెచ్‌ఎండీఏ మళ్ళీ సర్వే చేస్తోంది. ప్రభుత్వం ఇక్కడ భూములను వేలం వేసినప్పుడు బిడ్డర్లకు ఎక్కువ భూమి వెళ్ళిపోయిందని అనుమానిస్తోంది హెచ్‌ఎండీఏ. లే అవుట్‌లను అభివృద్ధి చేసే క్రమంలో కొలతల సమస్య వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తోంది. అందుకే దీని స్పష్టత వచ్చేందుకు మళ్ళీ అక్కడ భూములను సర్వే చేపట్టింది. ఇలా బిడ్డర్లకు ఎక్కువ భూమి రావడం వల్ల కంపెనీలకు 1000 చదరపు గజాలు అధికంగా లభించినా.. ప్రభుత్వానికి దాదాపు 20 కోట్ల నష్టం వాటిల్లితుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కోకాపేటలో చదరపు గజం రెండు లక్షలు పలుకుతోంది. దాదాపు రూ.300 కోట్ల వరకు ఆస్తులను బిడ్డర్లకు రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ హెచ్‌ఎండీఏపై ఒత్తిడి తెస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.300 కోట్ల వరకు ఆస్తులను బిడ్డర్లకు రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ హెచ్‌ఎండీఏపై ఒత్తిడి తెస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దీంతో 2006లో వేలం వేసిన గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్‌తో సహా కోకాపేట్ భూమిని హెచ్‌ఎండీఏ ప్రస్తుతం సర్వే చేస్తోంది. ఈ సర్వే బుద్వేల్ లేఅవుట్‌ను కూడా కవర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ టోటల్ సిస్టమ్ (ETS), భౌతిక ధృవీకరణ సహాయంతో కొలతలు తీసుకునే ప్రక్రియలో ఉన్నామని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చెపారు. కోకాపేటలోని నియోపోలీస్‌లో ప్రభుత్వం రెండు దశల్లో సుమారు 95 ఎకరాలను వేలం వేసింది. 2021 జూన్‌లో జరిగిన మొదటి దశ వేలం ద్వారా దాదాపు రూ. 2,000 కోట్లు రాగా... ఆగస్టు 2023లో జరిగిన రెండో దశ ద్వారా ప్రభుత్వానికి రూ. 3,300 కోట్లు వచ్చాయి. ఇక బుద్వేల్‌లో గత ఏడాది 100 ఎకరాల విస్తీర్ణంలో భూములు విక్రయించగా.. ప్రభుత్వానికి రూ.3,625 కోట్లు వచ్చాయి. అలాగే గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్ భూమిని 2006లో విక్రయించారు.
Also Read: Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్..