Ap Politics:ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాజీ క్రికెటర్ రాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధిక్యత దిశగా కొనసాగుతుండటం పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర కూడా కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు.మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో దేశవ్యాప్తంగా ఎన్టీయే కూటమి గెలుపు దిశగా కొనసాగుతుండగా ఏపీలో మరింత దూకుడుతో ముందుకు దూసుకుపోతుంది.
175 అసెంబ్లీ సీట్లలో దాదాపు 145 సీట్లలో కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు స్థానాల్లో వైసీపీ అధిక్యంలో ఉండగా మిగతా 21 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
Also read: చరిత్ర తిరగరాసిన నారా లోకేష్..ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటి వరకు!