Karnataka:కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిపై కరెంట్ చోరీ కేసు By Manogna alamuru 15 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఒక్కోసారి భలే విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి. బెంగళూరులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కమారస్వామి మీద కేసు కూడా అలాంటిదే. ఇంతటి వ్యక్తి కరెంట్ దొంగతనం చేశారంటూ బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన ఇంటిని అలంకరించేందుకు తన ఇంటి పక్కనే వీధిలో ఉన్న ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం (బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించారు. ఈ సంఘటనపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు కుమారస్వామి మీద సెక్షన్ 135 కింద కేసును పెట్టారు. ఈ నేరం కనుక రుజువైతే మూడేళ్ళ జైలుశిక్ష లేదా జరిమానా ఉంటుంది. అయితే కుమారస్వామి వెర్షన్ వేరేలా ఉంది. దీపావళి పండుగకు తన ఇంటికి లైట్లు పెట్టమని ఓ ప్రవైటు డెకొరేటర్ కు అప్పగించామని...వాళ్ళు టెస్టింగ్ కోసం బయట విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ తీసుకున్నారని చెబుతున్నారు కుమారస్వామి. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని...వచ్చినవెంటనే అక్కడి నుంచి తీసి ఇంటిలో విద్యుత్ వాడుకోవాలని చెప్పానని అంటున్నారు. ఇది అక్రమమని అనుకుంటే అధికారులు తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేయవచ్చని తెలిపారు. దానికి పూర్తిగా సహకరిస్తామని అంటున్నారు కుమారస్వామి. నేరం రుజువైతే జరిమానా కట్టేందుకు కూడా సిద్ధమని వివరణ ఇచ్చారు. దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదని వ్యాఖ్యానించారు. అయితే కుమారస్వామి ఇలా దతొరికిపోవడం కాంగ్రెస్‌కు మంచి అవకాశం దొరికినట్టు అయింది. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని...కాంగ్రెస్ మాట ప్రజలు నమ్మొద్దని వ్యాఖ్యలు చేశారు. అది మాట్లాడిన నెక్స్ట్ డేనే ఈ సంఘటన జరగడంతో కుమారస్వామి విద్యుత్ దొంగిలించారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. #police #bengaluru #karnataka #case #current #jds #kumaraswami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి