Weather Alert : హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు..

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్‌ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్‌కేసర్‌లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్‌లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Weather Alert : హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు..
New Update

Hyderabad Weather Report : దేశవ్యాప్తంగా ఎండలు(Sun) మండిపోతున్నాయి. మధ్యాహ్నం బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చాలాప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటింది. అయితే ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్‌(Hyderabad) బేగంపేట(Begumpet) లోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. 2015 తర్వాత బేగంపేటలో ఈ స్థాయిలో ఎండ తీవ్రత పెరగడం ఇదే మొదటిసారి.

Also Read: రోహిత్ వేముల సూసైడ్ కేసుపై పోలీసుల సంచలన రిపోర్టు..

ఇక హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లో కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు.. కీసర, ఘట్‌కేసర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్, చిల్కూరు, మోయినాబాద్‌లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఇంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. మే 6 వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలాఉండగా.. తెలంగాణలోని జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్‌తో పాటు అనేక జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. చల్లబడనున్న వాతావరణం

#telugu-news #telangana-news #hyderabad #weather-alert #summer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe