MP Bandi Sanjay: అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తీవ్రవాదులను తయారు చేస్తూ బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక్ జమాతే సంస్థ కు నిధులిస్తున్న ప్రభుత్వం 41 రోజుల కఠోర దీక్ష చేసే అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులెందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ‘‘శబరిమలలో గత కొద్దిరోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు మీ కళ్లకు కన్పించడం లేదా? అక్కడ తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. గజగజ వణికి చలిలో గంటల తరబడి నిలబడి అరిగోస పడుతున్న దారుణ ద్రుశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నయ్. చిన్న పిల్లోడిని కదిలించినా ఆ స్వాముల కష్టాలు చెబుతారు… మరి పాలకులకు కనబడకపోవడం సిగ్గు చేటు’’అని అన్నారు.
ALSO READ: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా?
‘వీర్ బాల దివస్’ సందర్భంగా ఈ రోజు కరీంనగర్ లోని సిక్కులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ వారితో కలిసి గురుద్వార్ కు విచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర చేస్తున్నారు. ఎక్కువ మంది దర్శించుకునే ధార్మిక ప్రదేశాల్లో భయానక వాతావరణాన్ని స్రుష్టిస్తూ, సరైన సౌకర్యాలు కల్పించకుండా చేయడంవల్ల భక్తులు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. తిరుమలలోనూ పులులు వస్తున్నాయనే భయంతో భక్తులు రాకుండా చేస్తూ హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా కుట్ర జరుగుతోంది. హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. మసీదులో పనిచేసే ఇమామ్ లకు, చర్చిల్లో పనిచేసే ఫాస్టర్లకు జీతాలిస్తున్న ప్రభుత్వం ఆలయ పూజారులకు, గురుద్వారాలో పనిచేసే గురువులకు జీతాలెందుకు ఇవ్వడం లేదో ఆలోచించండి. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్వార్ధ రాజకీయాలకు తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నా' అని అన్నారు.
ALSO READ: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్!