Bandi Sanjay:15 దశాబ్దాల కల నెరవేతోంది

మహిళా బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు.

New Update
Bandi Sanjay:15 దశాబ్దాల కల నెరవేతోంది

మహిళా బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 15 దశాబ్దాల నాటిదన్నారు. 1975లోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని లోక్‌సభలో చర్చ జరిగినట్లు బండి సంజయ్‌ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అనుసరించిన ద్వంద వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోలేదన్నారు.

మరోవైపు అటల్‌ బిహారీ వాజ్‌ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1998వ ఏడాది జూలైలో తొలిసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపిన ఆయన.. కానీ కాంగ్రెస్‌, ఆర్జేడీతో పాటు విపక్షాల వ్యతిరేకత వల్ల ఆమోదం పొందలేకపోయిందన్నారు. ఆ తర్వాత వాజ్‌ పేయి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును మరో మూడు సార్లు ప్రవేశపెట్టినా విపక్షాల కుట్రల వల్ల మూడు సార్లు ఆమోదానికి నోచుకోలేదని గుర్తు చేశారు. 10 ఏళ్లు యూపీఏ ఛైర్‌ పర్సన్‌గా పనిచేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ, పార్లమెంట్‌లో పూర్తి మెజారీ ఉన్నప్పటీకీ మహిళా రిజర్వేషన్‌ బిల్లును మాత్రం ఆమోదించలేపోయారన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మహిళలపై ఉన్న గౌరవం, మహిళలు అభివృద్థి చెందకుండా అడ్డుకున్న కుట్రల గురించి ప్రజలకు అర్దమైందని బండి సంజయ్‌ మండిపడ్డారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్టీఏ కూటమి పార్లమెంట్‌లో పూర్తి మెజార్టీతో ఉందన్న బండి సంజయ్‌.. మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సారి కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు వ్యతిరేకించినా మహిళా బిల్లు పాస్ కావడం ఖాయమన్నారు. మరోవైపు మహిళా బిల్లుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నాయన్న ఆయన.. విపక్ష పార్టీలు తమ వైఖరిని మానుకోవాలన్నారు. విపక్షాలు అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు కల్పించి చిత్తశుద్ది చాటుకోవాలని తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు