Telangana : తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా (Khammam District) పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) దృష్టికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీసుకెళ్లారు. జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది అలాగే మరికొన్ని బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్నట్లు అమిత్ షాకు వివరించారు. దీంతో రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్‌ఎఫ్‌ను ఆదేశించారు.
Also Read: ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన పోలీసులు-VIDEO
ఈ నేపథ్యంలో చెన్నై, విశాఖపట్నం, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపించారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను బండి సంజయ్ సూచించారు. దీంతో సిబ్బంది రంగంలోకి దిగారు.