author image

Trinath

Latest Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్‌.. లక్షా 50వేల శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం!
ByTrinath

ఆదాయపు పన్ను శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ కింద ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్‌కు ఎంపికైతే రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు, ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు ఎంపికైతే రూ.18,000-56,900 వేతనం లభిస్తుంది.

NIA RAIDS: ఎస్ఐఏ దాడుల్లో మొత్తం ఎంత దొరికిందంటే?
ByTrinath

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ఏడుగురు హెచ్ఆర్ఎఫ్ అధికారుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జరిపిన దాడులను ఆంధ్రప్రదేశ్‌లోని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ఖండించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు కలకలం రేపాయి. తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల ఎస్ఐఏ దాడులు చేసింది. తెలంగాణలో 9 చోట్ల ,ఆంధ్రాలో 53 చోట్ల సోదాలు చేశారు. సత్యసాయి జిల్లాలో పిస్టల్, 14 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కడపలో 13 లక్షలు సీజ్ చేశారు.

Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్‌!
ByTrinath

ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి స్పెషల్‌ మొబైల్‌ కోర్టు బెయిల్ ఇచ్చింది. అటు బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ప్రజాజీవితంలో కానీ, పని ప్రదేశంలో కానీ ఏ మహిళకైనా ప్రశ్నార్థకమైన వ్యక్తిత్వం ఉంటుందని నమ్మే బండారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని రోజా మీడియా సంస్థలను సైతం ప్రశ్నించారు. చంద్రబాబు స్వయంగా మహిళలను అగౌరవపరుస్తున్నారని రోజా ఆరోపించారు.

World cup 2023: క్రికెట్ అభిమానుల కష్టాలు.. VPN ఆన్‌ చేసుకోవాల్సి వస్తోంది భయ్యా!
ByTrinath

ఈ నెల 14న ఇండియా వర్సెస్ పాక్ ప్రపంచ కప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో పాక్‌ క్రికెట్ లవర్స్‌కి వీసా కష్టాలు ఎక్కువయ్యాయి. భారత ప్రభుత్వ వెబ్ సైట్లను యాక్సెస్ చేయడంపై పాక్ గతంలో ఆంక్షలు విధించింది. దీంతో హైకమిషన్ వెబ్సైట్‌ని యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో వీపీఎన్‌ను ఉపయోగించుకోవాల్సి వస్తోంది.

Sitting Problems: ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇన్ని సమస్యలా? ఇది సిగరేట్‌ కంటే డేంజర్ బాసూ!
ByTrinath

ఎక్కువసేపు కూర్చోవడం డీప్ సిర థ్రాంబోసిస్ (DVT) కు కారణమవుతుంది. ఉదాహరణకు సుదీర్ఘ విమానం లేదా కారు ప్రయాణంలో. డీప్ సిర థ్రాంబోసిస్ అనేది మీ కాలు సిరలలో ఏర్పడే రక్తం గడ్డకట్టడం లాంటిది. ఇది మీ ఊపిరితిత్తులతో సహా శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. ఇది పల్మనరీ ఎంబాలిజానికి కారణమవుతుంది. ఇది వైద్య అత్యవసర పరిస్థితి. ఇది కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. అందుకే వ్యాయమం ఇంపార్టెంట్.

KTR VS Modi: 'మాకేం పిచ్చి కుక్క కరవలేదు'.. 'దగుల్‌బాజీ మాటలు, అడ్డమైన చెత్త వాగుడు'..! కేటీఆర్‌ ఫైర్!
ByTrinath

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని.. ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారన్న మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. గుండెలు చించుకొని అరిసినంత మాత్రానా అబద్ధాలు నిజం అయిపోవన్నారు కేటీఆర్. మీరు పొత్తు పెట్టుకుంటే రాచరికాలు గుర్తుకురావా అని ప్రశ్నించారు కేటీఆర్‌. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు లోకేశ్‌ మంత్రేగా అని నిలదీశారు.

World Animal Day 2023: అంతర్జాతీయ జంతు దినోత్సవం.. భూమి మనుషులది మాత్రమే కాదు బాసూ..!
ByTrinath

ప్రతిఏడాది అక్టోబర్‌ 4న ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారంతో పాటుగా జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సం‌రక్షణకు నిధులు సేకరించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి జంతు ప్రేమికులు ప్రపంచ జంతు దినోత్సవం వేడుకలో పాల్గొంటారు.

Bandaru Vs Roja: బండారు బూతులపై రోజా కంట తడి..వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి!
ByTrinath

ఏపీ సీఎం జగన్‌, మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై రోజా ఫైర్ అయ్యారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

World cup 2023: వరల్డ్‌ కప్‌ అంటే ఈ ఆటగాడికి పూనకాలు పక్కా భయ్యా.. ఆ లెక్కలు చూస్తే షాక్‌ అవుతారు!
ByTrinath

మరో రెండు రోజుల్లో క్రికెట్ ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా అభిమానులు వరల్డ్‌కప్‌ స్టాట్స్‌పై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ క్రియేట్ చేసిన రికార్డులు ఈసారి బ్రేక్‌ అవుతాయా లేదా అన్నదానిపై ట్వీట్లు పెడుతున్నారు. ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు, అత్యధిక 100లు, అత్యధిక 50లు, అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డులు సచిన్‌ పేరిట ఉన్నాయి.

Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ క్యాడర్‌లో టెన్షన్!
ByTrinath

పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని.. తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. పొత్తులపై పవన్ ప్రకటనతో పాటు ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమది ప్రాంతీయ పార్టీ కాదు అని జాతీయ పార్టీ అంటూ కామెంట్స్ చేశారు.

Advertisment
తాజా కథనాలు