Sachin Tendulkar To Zaheer Khan team India Top Performers: వరల్డ్‌కప్(world cup) 2023) అంటే ప్రాణం పెట్టి ఆడే ఆటగాళ్లు ఉంటారు. అందులో క్రికెట్ గాడ్ సచిన్ నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటాడు. మిగిలిన టోర్నమెంట్లలో కూడా సచిన్‌కి సాటి లేనప్పటికీ ప్రపంచ కప్ అంటే మాత్రం సచిన్‌లో మరో యాంగిల్ కనిపిస్తుంది. 2007 ప్రపంచ కప్ మినహా దాదాపు ప్రతి వరల్డ్‌కప్‌లోనూ సచిన్ అద్భుతంగా రాణించాడు. టీమిండియాకు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించాడు. 2011 ప్రపంచకప్‌ను గెలుచుకోని తన కలను సాకారం చేసుకున్నాడు. అయితే ప్రపంచ కప్‌లో సచిన్ క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. సచిన్‌తో పాటు జహీర్ ఖాన్ సహా మరికొందరి రికార్డులు ఇప్పటివరకు చెక్కుచెదరలేదు. అలాంటి రికార్డులపై ఓసారి లుక్కేయండి.
➡ అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ (2278 మ్యాచ్‌లలో 45 పరుగులు)
World cup 2023: వరల్డ్ కప్ అంటే ఈ ఆటగాడికి పూనకాలు పక్కా భయ్యా.. ఆ లెక్కలు చూస్తే షాక్ అవుతారు!
మరో రెండు రోజుల్లో క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కానుండగా అభిమానులు వరల్డ్‌కప్ స్టాట్స్‌పై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో క్రికెట్ గాడ్ సచిన్ క్రియేట్ చేసిన రికార్డులు ఈసారి బ్రేక్ అవుతాయా లేదా అన్నదానిపై ట్వీట్లు పెడుతున్నారు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక 100లు, అత్యధిక 50లు, అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి.

Translate this News: