నేటి కాలంలో వ్యాయమం చేసే టైమ్ ఎక్కువగా ఉండడంలేదు. ఆఫీస్ నుంచి ఇంటికి.. ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్లడానికే టైమ్ అంతా సరిపోతుంది. సిటీల్లో అయితే సగం జీవితం ట్రాఫిక్‌లోనే గడిచిపోతుంది. ఇది లైఫ్‌స్టైల్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆఫీస్ వర్క్‌లో ఎక్కువ మంది చేసేది డెస్క్ వర్క్. అంటే కూర్చోని చేసే పని. దీర్ఘకాలికంగా ఆచరణాత్మకం కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో గుండెపోటు, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు, కొన్ని క్యాన్సర్లు లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Sitting Problems: ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇన్ని సమస్యలా? ఇది సిగరేట్ కంటే డేంజర్ బాసూ!
ఎక్కువసేపు కూర్చోవడం డీప్ సిర థ్రాంబోసిస్ (DVT) కు కారణమవుతుంది. ఉదాహరణకు సుదీర్ఘ విమానం లేదా కారు ప్రయాణంలో. డీప్ సిర థ్రాంబోసిస్ అనేది మీ కాలు సిరలలో ఏర్పడే రక్తం గడ్డకట్టడం లాంటిది. ఇది మీ ఊపిరితిత్తులతో సహా శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. ఇది పల్మనరీ ఎంబాలిజానికి కారణమవుతుంది. ఇది వైద్య అత్యవసర పరిస్థితి. ఇది కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. అందుకే వ్యాయమం ఇంపార్టెంట్.

Translate this News: