Jansena BJP alliance: ఏపీలో రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధికార వైసీపీ సంగతి పక్కనపెడితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా జగన్ సర్కార్‌ని గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న జనసేన, టీడీపీ పార్టీలు పొత్తుల విషయంలో క్యాడర్ని అయోమయానికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఓవైపు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. కమలం పార్టీ పెద్దల అనుమతి లేకుండానే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. ఈ మాజీ సీఎంని రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ కలవడం.. వెంటనే టీడీపీతో కలిసి పని చేస్తామని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం పవన్ వారాహి యాత్రలో ఉన్నారు. నిన్ననే మచిలీపట్నం టీడీపీ నేతలతో మీటింగ్ పెట్టారు. బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీకి మాత్రం సపోర్ట్ ఉంటుందని తెలుగుదేశం నేతలతో పవన్ చెప్పారు. ఇక జరుగుతున్న పరిణామాలపై ఆచితూచీ మాట్లాడుతూ వస్తోన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్ క్యాడర్లో టెన్షన్!
పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని.. తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పొత్తులపై పవన్ ప్రకటనతో పాటు ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమది ప్రాంతీయ పార్టీ కాదు అని జాతీయ పార్టీ అంటూ కామెంట్స్ చేశారు.

Translate this News: