author image

Trinath

World cup 2023: ఈ మాత్రం దానికి వార్మప్‌ మ్యాచ్‌లు ఎందుకు? మరో గేమ్‌ కూడా ఫసక్..!
ByTrinath

టీమిండియా ఆడాల్సిన మరో వార్మప్‌ మ్యాచ్‌ కూడా రద్దయింది. టాస్‌ కూడా వేయకుండానే వర్షం కారణంగా మ్యాచ్‌ని క్యాన్సిల్ చేశారు. గత శనివారం గువాహటిలో ఇంగ్లండ్‌పై జరగాల్సిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా బంతి కూడా పడలేదు. ఇప్పుడు కేరళ-తిరువనంతపురం మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో టీమిండియా తన 2023 వరల్డ్‌కప్‌ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

Earthquake: భూకంప సమయంలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ByTrinath

ఢిల్లీతో పాటు ఉత్తరభారత్‌దేశంలో భూకంపం రావడం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది ఇళ్లు, ఆఫీస్‌లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చినప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్‌ను అనవసరంగా ఉపయోగించవద్దు, కిటికీల దగ్గర ఉండొద్దు, దెబ్బతిన్న భవనంలోకి తిరిగి ప్రవేశించవద్దు, అగ్గిపెట్టెలు లేదా లైటర్లను ఉపయోగించవద్దు లాంటి టిప్స్‌ని పాటించాలి.

Chandrababu case: నేడు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. ఏం జరగబోతోంది?
ByTrinath

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు దారితీసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై తమ అభిప్రాయాన్ని వినాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు ఇవాళ(అక్టోబర్ 3) విచారణకు రానుంది.

Digestion Tips: ఈ ఐదు పండ్లతో మలబద్ధకానికి చెక్‌..ప్రాబ్లెమ్స్‌ అన్ని ఫసక్‌..!
ByTrinath

మలబద్ధకం సమస్య ప్రస్తుతం చాలామందిని వేధిస్తోన్న ప్రాబ్లెమ్. ముఖ్యంగా సిటీ లైఫ్‌కి అలవాటు పడినవాళ్లకి జీర్ణ సమస్యలు పెరిగిపోతున్నాయి. యాపిల్స్, నేరేడు పండ్లు, కివీ, మామిడిపండ్లు, అరటిపండ్లతో జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

Varahi Yatra: 'బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే'.. పవన్‌ ఏం అన్నారంటే?
ByTrinath

బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతో కలిసి పనిచెస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. బిజెపి కలిసి వస్తుందని పవన్ చెప్పారన్నారు. మచిలీపట్నం టీడీపీ నేతలతో పవన్‌ సమావేశామయ్యారు. అంచలంచలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని అటు పవన్‌కళ్యాణ్‌ హాట్ కామెంట్స్ చేశారు.

Pawan kalyan: డబ్బు కోసమే చేస్తున్నాను.. సినిమాలు ఆపేస్తున్నానంటూ బాంబు పేల్చిన పవన్‌!
ByTrinath

2008లో రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మొగ్గలోనే తుంచేశారని పవన్‌ అభిప్రాయపడ్డారు. మనవారే మనకి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు ప్రభుత్వం జనసేన మీద దాడులు చేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది అంటే మనది పోరాట బలమని పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గొప్ప ఆత్మబలం ఉన్న రాజకీయ శక్తి జనసేన పార్టీని చెప్పారు. డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను... సినిమాలు సమీప భవిష్యత్ లో ఆపేస్తానని పవన్‌ తెలిపారు.

Pawan kalyan TDP: 'ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది'.. పవన్‌ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ..!
ByTrinath

ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా అనేది తనకు సందేహమేనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలెయన్స్‌లో వెళితే మనకి బలమైన సీట్లు వస్తాయని మచిలీపట్నంలో టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బలమైన పాదముద్ర ఉండబోతుందని.. జనసేన ,టీడపీ ఎదుగుతాయిన్నారు. భవిష్యత్‌లో అవనిగడ్డ, మచిలీపట్నం , పెడన , కైకలూరుని చతుర్ముక నగరంగా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు.

War2: ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. హృతిక్ రోషన్‌తో కాంబోపై అదిరే అప్‌డేట్!
ByTrinath

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న వార్‌-2 సినిమాపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా.. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా గురించి చర్చించడానికి ముఖర్జీ జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో ఎన్టీఆర్, అయాన్‌ల భేటీకి సంబంధించిన అప్ డేట్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Modi On Caste Census: కులం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు.. కుల గణన నివేదిక తర్వాత మోదీ వ్యాఖ్యలు!
ByTrinath

బీహార్‌ కుల గణన నివేదిక రాజకీయంగా పెద్ద రచ్చ లేపుతోంది. తమ రాష్ట్రంలో కులాల లెక్కలను నితీశ్‌ సర్కార్‌ బహిర్గతం చేసింది. కులాల ప్రతిపాదికన జనాభా గణన జరగాలని కాంగ్రెస్‌ సహా అనేక యాంటీ బీజేపీ పార్టీలు పట్టుపడుతున్న వేళ ఈ నివేదిక రిలీజ్ అయ్యింది. దీనిపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కులం పేరిట దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీపై కీలక ఉత్తర్వులు జారీ!
ByTrinath

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్)ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు