మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Bandaru satyanarayana)కి బెయిల్(bail) ఇచ్చింది కోర్టు. స్పెషల్ మొబైల్ కోర్టు బండారుకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సీఎం జగన్, మంత్రి రోజా(Roja)పై అనుచిత వ్యాఖ్యల కేసులో నిన్నంతా విశాఖలో బండారు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. చాలాసేపటి తర్వాత నిన్న రాత్రి అరెస్ట్ చేసి గుంటూరకు తరలించారు పోలీసులు. అంతకముందు గుంటూరు జీజీహెచ్లో మాజీ మంత్రికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు బండారును తీసుకెళ్లగా.. కోర్టు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్!
ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అటు బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ప్రజాజీవితంలో కానీ, పని ప్రదేశంలో కానీ ఏ మహిళకైనా ప్రశ్నార్థకమైన వ్యక్తిత్వం ఉంటుందని నమ్మే బండారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని రోజా మీడియా సంస్థలను సైతం ప్రశ్నించారు. చంద్రబాబు స్వయంగా మహిళలను అగౌరవపరుస్తున్నారని రోజా ఆరోపించారు.

Translate this News: