Australia`s Bird Flu Case: ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా బర్డ్‌ఫ్లూ కేసు నమోదయింది. అది కూడా ఒక చిన్నారికి. అయితే ఇప్పుడు ఆ చిన్నారికి బర్డ్‌ఫ్లూ భారతదేశం (India) నుంచే వచ్చిందని చెబుతోంది డబ్లూహెచ్‌వో (WHO). చిన్నారి కుటుంబం కొలకత్తాకు వెళ్ళింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తనకు వైరస్ ఉన్నట్లు తెలిసింది. అయితే కొలకత్తాలో తాము బర్డ్‌ఫ్లూ ఉన్న వ్యక్తులను కానీ, జంతువులను కానీ కలవలేదని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. అయినా వైరస్ ఎలా సోకిందో తెలియడం లేదని అన్నారు.
విక్టోరియాకు చెందిన రెండేళ్ల బాలిక ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 19 వరకు కోల్‌కతాకు వెళ్లి మార్చి 1న ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుతం చిన్నారి వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. మార్చి 22న బర్డ్‌ఫ్లూ వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన బాలుడు రెండు వారాల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. అయితే బాలుడికి వ్యాధి ఎలా సోకిందనేది మాత్రం కచ్చితంగా తెలియలేదు. ఒక్కోసారి వ్యాధి సోకిన పక్షుల మాంసం, గుడ్లు తినడం ద్వారా కూడా బర్డ్ ఫ్లూ రావచ్చిన ఆస్ట్రేలియాలో డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇవన్నీ అనుమానాలు మాత్రమేనని..ఎలా వచ్చిందనేది నిర్ధారణకు రాలేదని తెలిపారు.
మరోవైపు ఆస్ట్రేలియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం, పక్షులు, పౌల్ట్రీకి సంబంధించిన ఎగుమతులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. మాంసం, గుడ్లులతో పాటూ అడవి, దేశీయ పక్షుల దిగుమతులను తక్షణమే నలిపివేస్తున్నట్టు ఫిలిప్పీన్స్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Also Read:Chandrababu: గాడ్ ఫాదర్‌కు ఘన నివాళి.. రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు!