ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ

ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ
New Update

August Movie Release Dates: ఆగస్ట్ నెల వచ్చేసింది. మళ్లీ కొత్త సినిమాలు క్యూ కట్టాయి. అయితే ఈనెలకు ఓ ప్రత్యేకత ఉంది. రెండో వారం నుంచి చూసుకుంటే, ప్రతి వారం ఓ మెగా మూవీ థియేటర్లలోకి వస్తోంది. అదే ఆగస్ట్ నెల బాక్సాఫీస్ హైలెట్.

ముందుగా ఆగస్ట్ మొదటి వారంలోకి వద్దాం.. ఈ వారంలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాజుగారి కోడిపులావ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, మిస్టేక్, ఎల్జీఎం, హెబ్బులి, భైరవద్వీపం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, దిల్ సే, ప్రియమైన ప్రియ, బ్లడ్ అండ్ చాక్లెట్ అనే సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

వీటిలో ఎల్జీఎం సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఎందుకంటే, క్రికెటర్ ధోనీ(Dhoni) నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. ఇక ఈ వారం సూర్య సన్నాఫ్ కృష్ణ్, భైరవద్వీపం రీ-రిలీజ్ అవుతున్నాయి.

ఆగస్ట్ రెండో వారంలో.. జైలర్ (Jailer August 10), భోళాశంకర్(Bholaa Shankar -11), ఉస్తాద్ (Usthaad -12) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా భోళాశంకర్. చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. విడుదలకు లైన్ క్లియర్ అయింది. మెహర్ రమేష్ దర్శకుడు.

ఇక చిరంజీవి సినిమాకు ఒక రోజు ముందు రజనీకాంత్ నటించిన జైలర్ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక శ్రీసింహా నటించిన ఉస్తాద్ అనే చిన్న సినిమా కూడా ఇదే వారంలో వస్తోంది.

మూడోవారంలో.. ఆదికేశవ, ప్రేమ్ కుమార్, పెదకాపు-1, నచ్చినవాడు అనే సినిమాలొస్తున్నాయి. ఇందులో ఆదికేశవ మెగా మూవీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఇది. శ్రీలల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ అడ్డాల తీసిన పెదకాపు-1, సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ కూడా వస్తున్నాయి.

ఆగస్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఇది. ప్రవీణ్ సత్తారు హీరోయిన్. ఫుల్ లెంగ్త్ స్టయిలిష్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాతో పాటు కార్తికేయ నటించిన బెదురులంక అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

Also Read: శ్రీకాకుళంలో నాగచైతన్య.. మత్స్యకారుడి జీవితం ఆధారంగా సినిమా

#megastar-chiranjeevi #varun-tej #august #telugu-movies #bholaa-shanka #jailer-movie #august-movie-release-dates #movies #rajinikanth #గాండీవధారి-అర్జున #ఆదికేశవ #భోళాశంకర్ #chiranjeevi #bholashankar #gandeevadhari-arjuna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి