Rajinikanth Jailer Movie : దుమ్ము దులుపుతున్న రజనీకాంత్
ఎట్టకేలకు మళ్లీ స్వింగ్‌లో కొచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. వరుస ఫ్లాపుల తర్వాత ఈ హీరో నటించిన జైలర్ సినిమా, సూపర్ హిట్టయింది. ప్రస్తుతం అన్ని సెంటర్స్‌లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముందుగా తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ హీరో, ఆ తర్వాత ఓవర్సీస్లో, అట్నుంచి అటు టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది.