Andhra Pradesh : ఏపీలో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజే స్పీకర్ ఎన్నిక

ఏపీలో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

AP Assembly Meet: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
New Update

Assembly Meetings : ఏపీ (Andhra Pradesh) లో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ (TDP) సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది.

Also Read: జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

గతంలో స్పీకర్‌ను అధికార, విపక్ష పార్టీలు కలిసి చైర్‌లో కూర్చోబెట్టేవి. స్పీకర్‌ ఎన్నికకు అందరూ తప్పకుండా పాల్గొనాల్సిన సంప్రదాయానికి వైసీసీ (YCP) విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అయితే.. ఈరోజు మాజీ సీఎం, పార్టీ చీఫ్ జగన్ పులివెందుల వెళ్తున్నారు. ఇక శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: తాగు నీటి నిధులన్నీ మళ్లించేశారా? అధికారులపై పవన్ ఫైర్!

#assembly-meetings #andhra-pradesh #pawan-kalyan #ap-cm-chandrababu #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe