Amaravathi: స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. గ్రామీణులకు సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల భయం లేకుండా చూడాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని, తాగు నీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ మేరకు కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా ప్రబలడంతో పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్., వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు శారీ చేశారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..AP News: తాగు నీటి నిధులన్నీ మళ్లించేశారా? అధికారులపై పవన్ ఫైర్!
స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు.
Translate this News: